Advertisement
భారత్, పాకిస్థాన్ రెండు దేశాల్లోనూ అనేక ప్రాంతాల్లో వరిని ముఖ్యంగా పండిస్తారు. చాలా మంది అనేక రకాల బాస్మతి రైస్ వెరైటీలను పండిస్తారు. అయితే బాస్మతి రైస్‌కు గాను భారత్ తాజాగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ కోసం యురోపియన్ యూనియన్ (ఈయూ)లో అప్లై చేసింది. అయితే ఈ విషయం అటు పాకిస్థాన్‌కు చాలా ఇబ్బందిని కలిగిస్తోంది.
నిజానికి పాకిస్థాన్‌లోనూ పలు రకాల బాస్మతి రైస్ వెరైటీలను పండిస్తారు. ఆ రైస్ ను యురోపియన్ యూనియన్ దేశాలు సహా ప్రపంచంలోని పలు ఇతర దేశాలకు కూడా పాకిస్థాన్ ఏటా పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంది. దాంతో పాకిస్థాన్‌కు భారీగా ఆదాయం వస్తోంది. అయితే బాస్మతి రైస్‌కు జీఐ ట్యాగ్ కోసం భారత్ అప్లై చేయడంతో పాకిస్థాన్‌కు ఈ విషయం ఇబ్బందిగా మారింది. ఎందుకంటే బాస్మతి రైస్‌కు భారత్‌కు జీఐ ట్యాగ్ వస్తే.. అప్పుడు పాకిస్థాన్ తన బాస్మతి రైస్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు ఉండదు. అందుకు భారత్ అనుమతి ఉండాలి. ఆ బియ్యాన్ని ఎగుమతి చేయాలన్నా భారత్‌కు చెందిన ఏదైనా బ్రాండ్ పేరిట పాకిస్థాన్ విదేశాలకు ఆ రైస్‌ను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పాకిస్థాన్‌కు భారీగా నష్టం సంభవిస్తుంది.
Advertisement
అయితే బాస్మతి రైస్‌కు అప్లై చేసిన జీఐ ట్యాగ్ వివరాలను సెప్టెంబర్ 11వ తేదీన యురోపియన్ యూనియన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ క్రమంలో 3 నెలల్లోగా ఏదైనా దేశం ఈ విషయాన్ని వ్యతిరేకించి అందుకు తగిన ప్రూఫ్‌లు చూపించాలి. లేదంటే జీఐ ట్యాగ్‌ను భారత్‌కు ఇస్తారు. తరువాత పాకిస్థాన్‌కు అసలు కష్టాలు మొదలవుతాయి. కానీ మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్‌గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ జీఐ ట్యాగ్‌కు సంబంధించిన చట్టాలను పాకిస్థాన్ ఇంకా అమలు చేయలేదు. మార్చిలోనే ఆ చట్టాల అమలుకు నిర్ణయం తీసుకున్నా.. ఆ నిర్ణయాన్ని ఇంకా అమలు చేయలేదు. దీంతో బాస్మతి రైస్‌కు జీఐ ట్యాగ్ విషయంలో పాకిస్థాన్‌కు తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా సదరు బాస్మతి రైస్‌కు చెందిన వెరైటీలను మన దేశంలో ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లలో ఎక్కువగా పండిస్తారు. అలాగే పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ పలు బాస్మతి వెరైటీలను పండిస్తారు. కానీ బాస్మతి రైస్‌కు జీఐ ట్యాగ్ కోసం భారత్ అప్లై చేయడం ఇప్పుడు పాకిస్థాన్‌కు మింగుడు పడడం లేదు.
Advertisements
అయితే ఇదే విషయంపై పాకిస్థాన్‌కు చెందిన తౌఫిక్ అహ్మద్ అనే ఓ ప్రముఖ బాస్మతి రైస్ ఎగుమతిదారు మాట్లాడుతూ యురోపియన్ యూనియన్‌లో బాస్మతి రైస్‌కు జీఐ ట్యాగ్ కోసం భారత్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను పాకిస్థాన్ వ్యతిరేకించవచ్చని, ఈ విషయంలో పాక్ త్వరగా స్పందించాలని, లేదంటే పాక్‌లో రైస్ ఎగుమతి వ్యాపారానికి గట్టి దెబ్బ పడుతుందని, దీంతో భారీగా నష్టం వస్తుందని అన్నారు. మరి పాకిస్థాన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Advertisements