Advertisement
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక, పురాతన ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో అనేక ఆధ్యాత్మిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఆయా నిర్మాణాల్లో నిజానికి శిల్ప కళా సంపద ఉట్టి పడుతూ ఉంటుంది. అప్పట్లోనే కళాకారులు భారీ రాళ్లను శిల్పాలుగా మలిచారంటే వారి ప్రతిభ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి భారీ శిల్పాలు ఉన్న ప్రాంతాల్లో ఉనకోటి అనే ప్రాంతం కూడా ఒకటి. ఇది త్రిపుర రాజధాని అగర్తలకు సుమారుగా 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ప్రాంతం గురించి నిజానికి మన దేశంలో చాలా మందికి తెలియదు.
ఉనకోటి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. పూర్వం ఉనకోటి ప్రాంతంలో 1 కోటి మంది దేవుళ్లు, దేవతలు విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారు. అయితే పరమశివుడు ప్రత్యక్షమై వారందరినీ మరుసటి రోజు తెల్లవారుజాము అయ్యే లోపు అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతాడు. కానీ దేవుళ్లు, దేవతలంరూ ఆదమరిచి నిద్రపోతారు. మరసటి రోజు ఉదయం శివుడు వచ్చి చూసి వారందరూ వెళ్లకపోయేసరికి వారిని శిల్పాలుగా మార్చేస్తాడు. అందుకనే దానికి ఉనకోటి అని పేరు వచ్చింది స్థానికులు చెబుతారు.
Advertisement
ఇక ఆ సంఘటనకు నిదర్శంగా ఉనకోటి ప్రాంతంలో మనం అనేక మంది దేవుళ్లు, దేవతలకు చెందిన భారీ శిల్పాలను కూడా చూడవచ్చు. వాటిని కొండ ప్రాంతంలో వాలుగా ఉన్న రాళ్లకు చెక్కబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రాంతంలో అలాంటి భారీ శిల్పాలు, కళాకృతులు మనకు అనేకం కనిపిస్తాయి. ఆ ప్రాంతమంతా చూడచక్కని పర్వతాలు, పచ్చని అటవీ ప్రాంతంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ దర్శనమిస్తుంది. ఇక అక్కడ శివుడితోపాటు వినాయకుడు, నంది, విష్ణు, హనుమాన్, నరసింహ, రావణ, పలు ఇతర దేవుళ్ల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.
Advertisements
Advertisements
ఒకప్పుడు ఉనకోటి ప్రాంతం బౌద్ధుల ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. అయితే దీన్ని గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ ప్రాంతం గురించి మన దేశంలోనే చాలా మందికి తెలియకపోవడం విచారకరం. నిజానికి ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు లభించాల్సింది. కానీ దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో విగ్రహాల కోసం అన్వేషిస్తోంది. వాటిని సేకరించి భద్రపరచాలని చూస్తోంది.