Advertisement
భారతదేశం సంస్కృతి, సంప్రదాయలకు పుట్టినిల్లు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత్. అందుకే భారతదేశమంటే ప్రపంచంలోని చాలా దేశాలకు గౌరవం, అభిమానం. ఇక్కడి సంస్కృతులు సంప్రదాయలను తెగ ఇష్టపడుతుంటారు. కొన్ని దేశాల ప్రజలైతే ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతారంటే మన దేశ గొప్పతనం ఏంటో ఇట్టే తెలుస్తుంది. మన కంటే అభివృద్దిలో వందల రెట్లు ముందున్న దేశాలు సైతం మనల్ని ఎంతో గౌరవిస్తున్నాయి. అందుకు కారణాలేంటి.. ఏ ఏ దేశాలకు భారతదేశమంటే గౌరవమో తెలుసుకుందాం..
జపాన్..
ఇండియన్స్ అంటే జపనీయులకు గౌరవం ఎక్కువ….ఎందుకంటే వారు పాటిస్తున్న మతం మన దేశంలోనే పుట్టడమే. వారు ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడతారు..అదీ మన సంస్కృతే…ఇక ఇండియన్ కూరలంటే వారికి తెగ ఇష్టం.!ఇక మ్యాథ్స్ లో ఇండియన్స్ కి ఎక్కువ పరిజ్ఞానం ఉందని నమ్ముతారు.
ఇటలీ..
Advertisements
ఇటలీ వారికి మన సంస్కృతి బాగా నచ్చుతుంది.. మన కుటుంబ వ్యవస్థ వారికి చాలా ఇష్టం…అంతేకాకుండా బంధాలకి బంధుత్వాలకి మనలాగే వారు కూడా అధిక ప్రాధాన్యతనిస్తారు!
తైవాన్..
Advertisement
1990 నుండి మనకు మరియు తైవాన్ కు మద్య సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో, పర్యావరణ సంబంధిత విషయాల్లో రెండు దేశాల మైత్రి చాలా బాగుంటుంది! ఇక్కడి వారు స్నేహభావంతో మెలుగుతారని వారి నమ్మకం.
కంబోడియా..
1952 నుండి ఆ దేశంతో మన స్నేహం కొనసాగుతుంది.! అక్కడి గుళ్లలలో చాలా వరకు మన దేవుళ్లున్నారు! వారి పూజ విధానం కూడా మనకు దగ్గరగా ఉంటుంది. మన సంస్కృతీసాంప్రదాయలను వారు చాలా గౌరవిస్తారు!
రష్యా..
రష్యా మొదటి నుండి మనల్ని అభిమానిస్తుంది…ఆ అభిమానంతోనే కార్గిల్ యుద్దంలో మనకు సహాయం చేసింది.! రష్యన్స్ వేకేషన్ ను ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇండియాకే వస్తుంటారు. మన యోగా అంటే కూడా అమితంగా ఇష్టపడుతుంటారు.!
Advertisements
ఇంగ్లాండ్..
మనల్ని బానిసలుగా చేసి పరిపాలించిన దేశం ఇంగ్లాడ్..కానీ వాళ్లు వెళుతూ వెళుతూ మన సంపదతో పాటు మన విలువల్నీ, మన మంచితనాన్ని తీసుకెళ్లారు. అందుకే ఇండియన్స్ అంటే వాళ్లు ప్రత్యేక అభిమానాన్ని చూపుతారు.! అక్కడ స్థిరపడ్డ ఇండియన్స్ కి రాజకీయంగా కూడా ప్రోత్సాహాన్నిస్తారు.