Advertisement
ఎన్నో పోరాటాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వొచ్చింది..కానీ అన్నదమ్ములుగా కలిసున్న దేశం రెండుగా విడిపోయింది. ఒకటి ఇండియా రెండు పాకిస్తాన్. ఇప్పుడే అసలు సమస్య వచ్చి పడింది కలిసున్న దేశాలను భౌగోళికంగా రెండుగా విడగొట్టాలి…? దీనికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించిన …. మౌంట్ బాటెన్ బ్రిటన్ నుండి రాడ్ క్లిఫ్ ను పిలిపించాడు.
బ్రిటిష్ పార్లమెంటు 1947 జూలై 15న భారత్‌లో బ్రిటిష్ రాజ్యం 1947 ఆగస్టు 15న ముగుస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందే జూలై 8 న రాడ్ క్లిఫ్ ఇండియా కు వొచ్చాడు…కేవలం 40 రోజుల్లోనే ఇండియా,పాకిస్థాన్ లకు మద్య సరిహద్దు రేఖను గీశాడు.
Advertisement
దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటో తెలుసా…? దేశ విభజన చేయడానికి ముందు రాడ్‌క్లిఫ్ భారత్‌ను ఒక్కసారి కూడా సందర్శించలేదు. కొద్దిమంది ఇచ్చిన సమాచారం తో …తన టేబుల్ మీద కూర్చొని మ్యాప్ ను చూస్తూ …రెండు దేశాలను విభజిస్తూ ఓ రేఖను గీశాడు …అదే ఇండియా పాక్ ల మధ్య ప్రామాణిక సరిహద్దు రేఖగా మారిపోయింది… రాడ్‌క్లిఫ్ గీశాడు కాబట్టి ఆ రేఖను రాడ్‌క్లిఫ్ అనే పేరు పడిపోయింది .
Advertisements
Advertisements
ఈ విభజన రేఖ ఒకే ఇంట్లో కొన్ని గదుల్ని భారత్‌కు, మరికొన్ని గదుల్ని పాకిస్తాన్‌కు కూడా కేటాయిస్తూ సాగిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి! విభజన రేఖను గీసినందుకు రాడ్ క్లిఫ్ కు 1947 లోనే 3000 పౌండ్స్ ను తీసుకోవాల్సిందిగా ఆఫర్ చేశారు, అయినప్పటికీ రాడ్ క్లిఫ్ ఆ ఆఫర్ ను తిరస్కరించారు.