Advertisement
స్పోర్ట్స్ , సినిమా ఇండియాలో మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్స్ … ప్లేయర్స్ కి నటులకు ఇక్కడ ఆ స్థాయిలో రెమ్యునరేషన్స్ ఉంటాయి ! ముఖ్యంగా క్రికెటర్లకు ఈ రెమ్యునరేషన్స్ పెద్దమొత్తంలో ఉంటాయి! పక్కనున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ వారి ఆటగాళ్లకు ఇచ్చే వేతనాన్ని, మన బోర్డ్ మన ఆటగాళ్లకు ఇచ్చే వేతనాన్ని ఓసారి పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం.!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ప్లేయర్లకు వారి ఆట ప్రదర్శనను బట్టి 3 కేటగిరిలుగా ( A, B, C ) విభజించి జీతాలు చెల్లిస్తుంది. అదే బీసీసీఐ అయితే 4 విభాగాల్లో (A+, A, B, C ) వేతనాలను చెల్లిస్తుంది.
గ్రేడ్ A+ :
ఇందులో కేవలం బీసీసీఐ మాత్రమే ప్లేయర్లకు వేతనాలను చెల్లిస్తుంది. పీసీబీలో గ్రేడ్ ఎ ప్లస్ అనే కేటగిరి లేదు. బీసీసీఐ ఈ విభాగంలో.. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రిత్ బుమ్రాలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.7 కోట్ల వరకు చెల్లిస్తుంది.
Advertisement
గ్రేడ్ A:
BCCI: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చటేశ్వర్ పుజారా, ఆజింక్యా రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్‌లకు.. రూ.5 కోట్ల వరకు చెల్లిస్తుంది.
PCB: బాబర్ అజం, అజర్ అలీ, షాహీన్ షా, అఫ్రిదిలకు రూ.61 లక్షలు చెల్లిస్తుంది.
Advertisements
Advertisements
గ్రేడ్ B :
BCCI: వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌లకు ఏడాదికి రూ.3 కోట్లు చెల్లిస్తుంది.
PCB: అసద్ షఫీక్, హారిస్ సొహెయిల్, మహమ్మద్ అబ్బాస్, షాదాబ్ ఖాన్, ఆబిద్ అలీ, మహమ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, షాన్ మసూద్, యాసిర్ షాలకు.. రూ.42 లక్షలు చెల్లిస్తుంది.
గ్రేడ్C:
BCCI: కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లకు ఏడాదికి రూ.1 కోటి వరకు చెల్లిస్తుంది. PCB: ఫఖర్ జమాన్, ఇమాద్ వసీం, ఇమామ్-ఉల్-హక్, నసీం షా, ఇఫ్తిఖర్ అహ్మద్, ఉస్మాన్ శిన్వారిలకు ఏడాదికి రూ.30 లక్షల వరకు చెల్లిస్తుంది.