Advertisement
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు భారత్ నుంచి విమాన సర్వీసులు రెగ్యులర్‌గా ఉండడం లేదు. కేవలం కొన్ని ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే సర్వీసులను నడుపుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక దేశాలు ఇ-వీసా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలకు మాత్రం వీసా అవసరం లేకుండానే భారతీయులు వెళ్లవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆ విధంగా బదులిచ్చారు.
Advertisement
- బార్బడోస్
- భూటాన్
- డొమినికా
- గ్రెనడా
- హయాతి,
- హాంగ్‌కాంగ్
- ఎస్ఏఆర్
- మాల్దీవులు
- మారిషన్
- నేపాల్
- న్యూ ఐల్యాండ్
- సమావ్
- సెనెగల్
- ట్రినిడాడ్ అండ్ టొబాగో
- సెయింట్ విన్సెంట్
- సెర్బియా
తదితర 16 దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు వీసా అక్కర్లేదు. ఇక మరో 43 దేశాల్లో భారతీయులకు అరైవల్ వీసా ఇస్తున్నారు. అంటే ఆయా దేశాల్లో ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యాక అరైవల్ వీసా తీసుకోవచ్చన్నమాట. ఇక మరో 36 దేశాల వారు భారతీయులకు ఇ-వీసా సౌకర్యం అందిస్తున్నారు.
ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ దేశాలు భారతీయులకు అరైవల్ వీసాను అందిస్తున్నాయి. అలాగే శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా తదితర దేశాలు భారతీయులకు ఇ-వీసా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీని వల్ల ఆన్‌లైన్‌లోనే వీసా తీసుకోవచ్చు. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. కాగా వీసా ఫ్రీ ట్రావెల్, వీసా ఆన్ అరైవల్ దేశాల జాబితాను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మురళీధరన్ తెలియజేశారు.
Advertisements