Advertisement
భారతదేశ చరిత్రకు సంబంధించి చిన్నప్పుడే మనం పాఠ్యపుస్తకాల్లో తెలుసుకున్నాం. ఎంతో మంది రాజులు మన దేశంలోని అనేక రాజ్యాలను పాలించారు. చాలా మంది రాజులు, రాజ్యాల గురించి తెలుసుకున్నాం. కానీ కొందరు రాజులను మాత్రం దేశం గుర్తించలేదు. వారి గురించిన చరిత్ర మరుగున పడిపోయేలా చేశారు. నిజానికి ఆ రాజుల గురించి కూడా మన పాఠ్య పుస్తకాల్లో పాఠాలను ఇచ్చి ఉండాల్సింది. కానీ వారి గురించి పుస్తకాల్లో ఇవ్వకపోవడంతో చాలా మందికి ఆ రాజుల గురించి తెలియదు. ఈ క్రమంలోనే ఆయా రాజుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. చోళులు:
చోళ సామ్రాజ్యానికి చెందిన రాజరాజ చోళుడు మాల్దీవులను, శ్రీలంక ఉత్తర భాగాన్ని తన సైనిక బలగంతో సొంతం చేసుకున్నాడు. అతని కుమారుడు రాజేంద్ర చోళుడు శ్రీలంక దక్షిణ భాగాన్ని, ఆగ్నేయాసియాలోని శ్రీవిజయ సామ్రాజ్యాన్ని, సుమత్రా దీవులను , అండమాన్ నికోబార్ దీవులను, మలేషియా, దక్షియ థాయ్‌లాండ్ సామ్రాజ్యాలను జయించి అజేయుడిగా నిలిచాడు. కానీ చోళుల గురించి మనకు పాఠ్యాంశాల్లో చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది.
2. ఛత్రపతి సంభాజీ మహరాజ్:
Advertisements
ఛత్రపతి సంభాజీ మహరాజ్ అప్పట్లో ఔరంగ జేబు దండయాత్రలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల పాటు యుద్ధం చేశాడు. అదే సమయంలో జంజీరా, బ్రిటిష్, పోర్చుగీస్ వారితోనూ యుద్ధం చేసి గెలిచాడు. కానీ మొగలుల చేతికి చిక్కి 40 రోజుల పాటు చిత్రహింసలకు గురయ్యాడు. తరువాత ప్రాణత్యాగం చేశాడు. ఈయన గురించి కూడా పాఠ్యాంశాల్లో ఎక్కడా మనకు సమాచారం ఇవ్వకపోవడం విచారకరం.
Advertisement
3. మహారాణా ప్రతాప్:
మహారాణా ప్రతాప్ 1582లో తన మంత్రి భామాషాతో కలిసి రెండు విభాగాలుగా తన సైన్యాన్ని విడగొట్టి మెరికల్లాంటి యోధులను తయారు చేశాడు. ఒక గ్రూప్ సైన్యంతో మహారాణా ప్రతాప్ వెళ్లాడు. మరొక గ్రూప్‌కు యువరాజు కున్వార్ అమర్‌సింగ్ నేతృత్వం వహించాడు. రెండు గ్రూప్‌లు ఒకేసారి మొగలులపై దండెత్తాయి. దీంతో మొగలులు యుద్ధం చేయలేక చేతులెత్తేశారు. 30వేల మంది మొగల్ సైనికులు మహారాణా ప్రతాప్ చేతికి బందీలుగా చిక్కారు. 36 మొగల్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. విజయదశమి రోజు మహారాణా ప్రతాప్‌ను విజయం వరించడం విశేషం.
4. మహారాజా సుహెల్‌దేవ్:
మహారాజా సుహెల్‌దేవ్ 1034లో 21 మంది రాజులతో కలిసి బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ సైన్యంతో మహమ్మద్ గజిని బంధువు సయ్యద్ మసూద్ సలార్‌ను భారత్‌లోకి రాకుండా అడ్డుకున్నాడు. దీంతో చాలా ఏళ్ల వరకు ముస్లిం రాజులు భారతదేశంపై దండెత్తే సాహసం చేయలేదు. తరువాత మహమ్మద్ ఘోరీ భారత్‌పై దండెత్తాడు. కాగా మహారాజా సుహెల్‌దేవ్ గురించి కూడా మనకు పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా సమాచారం లభ్యం కాదు. అది చాలా విచారకరం.
Advertisements