Advertisement
బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు మన దేశం నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి తరలించారు. వారి ఆహారపు అలవాట్లు, ఇతర ఆచారాలను మనపై రుద్దారు. అయితే దీంతోపాటు మన నైపుణ్యాలను, ప్రతిభను కూడా తమవిగా చెప్పుకుంటూ వారు కాపీ కొట్టారు. అవును నిజమే.. అందుకు భారత పార్లమెంట్ భవనమే చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
పైన ఉన్న రెండు నిర్మాణాలను చూశారు కదా. పై భాగంలో ఉంది చౌసత్ యోగిని ఆలయం. కింద ఉన్నది భారత పార్లమెంట్ భవనం. రెండూ ఒకేలా ఉన్నాయి కదా. అవును.. అచ్చు గుద్దినట్లు రెండూ ఒకేలా ఉన్నాయి. అయితే నిజానికి చౌసత్ యోగిని ఆలయాన్ని చూసే భారత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. అవును.. అది నిజమే.. 1910లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లూటియెన్స్ చౌసత్ యోగిని ఆలయాన్ని సందర్శించాడు. తరువాత 1912లో భారత పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశాడు. దీంతో ఆ డిజైన్‌తోనే పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
Advertisement
అయితే సర్ ఎడ్విన్ నిజానికి ఎక్కడా తాను ఆ ఆలయ నమూనాతో పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశానని చెప్పలేదు. కానీ అప్పట్లో భారత ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను అతనికే ఇచ్చింది. సర్ ఎడ్విన్ సొంతంగా ఆ భవనానికి డిజైన్ అందించారని మొత్తం క్రెడిట్‌ను అతనికే ఇచ్చింది. కానీ అతను ఆ ఆలయ నమూనాను కాపీ కొట్టి భారత పార్లమెంట్ కు డిజైన్ ఇచ్చాడన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా బ్రిటిష్ వారు మన ప్రతిభను కూడా వాళ్లదిగా చెప్పుకుని మనకు అన్యాయం చేశారన్నమాట.
ఇక ఆ ఆలయం మధ్య ప్రదేశ్లోని మొరెనాలో ఉంది. కానీ ప్రస్తుతం దానికి ఆదరణ లేకపోవడంతో శిథిలావస్థలో ఉంది. 1055 నుంచి 1075 సంవత్సరాల మధ్య ఈ ఆలయాన్ని కచ్చపగత రాజు దేవపాలుడు నిర్మించాడు. అప్పట్లో ఈ ఆలయంలో జ్యోతిష్య శాస్త్రం, గణితం పాఠ్యాంశాలను బోధించేవారు. ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ ఆలయం అనేక ప్రకృతి విపత్తులకు కూడా తట్టుకుని నిలబడింది. భూకంపాలు కూడా ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయాయి. చాలా పకడ్బందీగా ఆలయాన్ని నిర్మించారు. తరువాత అనేక వందల ఏళ్లకు ఇతర రాజ్యాలకు చెందిన రాజులు దాడి చేయడంతో ఆలయం ధ్వంసమైంది.
Advertisements
Advertisements