Advertisement
స్వాతంత్ర్యం వచ్చాక ఇండియా-పాకిస్తాన్ లు వేర్వేరు దేశాలుగా విడిపోయాయి! ఆ సందర్భంలో జనాభా ప్రాతిపదికన బ్రిటీషర్ల సమక్షంలోనే ఇరుదేశాలకు ఆస్తి పంపకాలు జరిగాయి. అయితే ఓ గుర్రపు బగ్గీని ఏ దేశానికి ఇవ్వాలి అని నిర్ణయించడానికి మాత్రం టాస్ వేశారు. ఆ టాస్ లో గెలిచి ..ఇండియా గుర్రపు బగ్గీని దక్కించుకుంది!
అప్పట్లో అధికారిక సమావేశాలకు , సందర్శనలకు వెళ్లేందుకు బ్రిటీష్ వైశ్రాయి బంగారు తాపడంతో చేయించిన గుర్రపు బగ్గీని వాడేవారు.! దేశ స్వాతంత్ర్యం తర్వాత ఈ బగ్గీ విషయంలో ఇరుదేశ నేతల మద్య వాగ్వాదం నడిచింది. బగ్గీ తమకే దక్కాలని వాదులాడుకున్నారు. దీంతో ఆ సమస్యను భారత లెఫ్టినెంట్ కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ ఆర్మీ అధికారి షహబ్జాదా యాకుబ్ ఖాన్లు రూపాయి బిళ్ల సాయంతో తీర్చారు.
Advertisement
అందరి సమక్షంలో….రూపాయి బిళ్లను టాస్ వేశారు…. బొమ్మ అని ఇండియా కోరగా, బొరుసు అని పాక్ కోరింది. కాయిన్ బొమ్మ పడింది, బగ్గీ ఇండియాకు దక్కింది. అప్పటి నుండి రాష్ట్రపతి ప్రతి అధికారిక కార్యక్రమానికి దీన్నే వాడేవారు. 1984 వరకు ఈ బండిని అన్ని వేడుకలకు రాష్ట్రపతి అధికార వాహనంగా ఉపయోగించేవారు. తర్వాత సెక్యురిటీ రీజన్స్ వల్ల…వాడడం ఆపేశారు. మళ్లీ ప్రణబ్ ముఖర్జీ అదే బగ్గీ మీద ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆయన తర్వాత రామ్ నాథ్ కోవింద్ కూడా పాత పద్దతిని పాటిస్తూ…ఈ బగ్గీ మీదే ప్రమాణ స్వీకారానికి వచ్చారు. !
ఈ బండిలో మొదట పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి, నూతన రాష్ట్రపతి చెరో పక్కన కూర్చుంటారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తర్వాత వారిద్దరూ గుర్రపు బండిలో తమ తమ స్థానాలను మార్చుకోవడం ఆనవాయితీ!
Advertisements
Advertisements