Advertisement
శరరీంలోకి ఓ వైపు 12 బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. అసలు కదిలేంత శక్తి కూడా లేదు. అయినప్పటికీ అతను మాత్రం యుద్ధంలో తీవ్రమైన పోరాటం చేశాడు. బుల్లెట్ల గాయాల ద్వారా తీవ్రంగా రక్తం పోతున్నా.. శత్రువుల బంకర్లపైకి దూసుకెళ్లాడు. ఒంటి చేత్తో పోరాటం చేస్తూ శత్రువులను తుదముట్టించాడు. అవును.. ఇది నిజంగా జరిగింది. సినిమా కథ కాదు. ఆ సాహసం చేసింది మరెవరో కాదు.. భారత్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న యోగేంద్ర సింగ్ యాదవ్..
కార్గిల్ యుద్ధంలో యోగేంద్ర సింగ్ చూపిన ధైర్య సాహసాలకు అతనికి భారత అత్యున్నత మిలిటరీ పురస్కారం పరమ వీర చక్ర లభించింది. అది కూడా కేవలం 19 ఏళ్ల వయస్సులోనే అతను ఆ సత్కారం పొందడం విశేషం. దీంతో యోగేంద్ర ఆ అవార్డు పొందిన అత్యంత పిన్న వయస్కుడు అయ్యాడు. యోగేంద్ర 1980లో ఉత్తరప్రదేశ్లో ఔరంగాబాద్ లోని అహిర్ గ్రామంలో జన్మించాడు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు.
Advertisement
సముద్ర మట్టానికి సుమారుగా 16,500 అడుగుల ఎత్తున్న టైగర్ హిల్ ప్రాంతాన్ని భారత్ యుద్ధంలో తన ఆధీనంలోకి తెచ్చుకుందంటే.. అందుకు యోగేంద్ర చూపిన ధైర్య సాహసాలే కారణం. అతను కొండ ప్రాంతాన్ని ఎక్కుతున్న సమయంలో ఇంకా 60 అడుగుల దూరం ఉందనగా.. పాక్ సైనికులు కాల్పులు జరిపారు. దీంతో అతని గజ్జలు, భుజాలలోకి 12 బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా రక్తస్రావం అయింది. అయినప్పటికీ అతను భయపడలేదు. వెనుకడుగు వేయలేదు. ముందుకే సాగాడు. చకచకా కొండ పైకి ఎక్కి బంకర్‌ను గ్రెనేడ్‌తో పేల్చేశాడు. దీంతో అందులో ఉన్న నలుగురు పాక్ సైనికులు హతమయ్యారు.
తరువాత మరో నలుగురు పాక్ సైనికులను చేతుల్తోనే ఫైటింగ్ చేసి హతమార్చాడు. మరో బంకర్‌ను కూడా ఇద్దరు భారత సైనికులతో కలిసి పేల్చేశాడు. దీంతో భారత ఆర్మీ నుంచి మరికొందరు సైనికులు అక్కడికి వచ్చే సరికి అక్కడ శత్రువులు లేకుండా పోయారు. టైగర్ హిల్ ప్రాంతం భారత్ ఆధీనంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధంలో నిజానికి టైగర్ హిల్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడమే భారత్‌కు అత్యంత కఠినమైన మిషన్ అయిందని చెప్పవచ్చు. అందుకనే ఆ మిషన్‌ను సక్సెస్ చేసిన యోగేంద్రకు ఆ అవార్డును బహుకరించారు.
Advertisements
Advertisements