Advertisement
భారతదేశంలోని చివరి గ్రామం ఎక్కడుందో తెలుసా?ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో సముద్రమట్టానికి దాదాపు 3200 మీటర్ల ఎత్తులో ఉంది.దాని పేరు మనా గ్రామం. ఈ గ్రామం చైనా భారత్ సరిహద్దుకు సరిగ్గా 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇక్కడ ఉండే దుకాణాలలో మీరు ఏ వస్తువులు కొనుగోలు చేసిన దానిపైన ‘ చివరి గ్రామం ‘ అని ప్రింట్ చేసి ఉంటుంది.
ఇక ఈ గ్రామం ప్రత్యేకతల విషయానికి వస్తే ఇక్కడి నుండి పాండువులు స్వర్గానికి చేరినట్లు చెబుతుంటారు.ఈ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 6597 అడుగులు ఎత్తులో ఉండే నీలకంఠ పర్వతం, అగ్నిదేవుడు నివాసముండే ప్రాంతంగా చెప్పే తప్త్ కుండ్, సరస్వతి నదిని దాటడానికి భీముడు నిర్మించిన భీమా పుల్(రాతి వంతెన),నాలుగు వేదాలను వేద వ్యాసుడు రచించినట్లు గా చెప్పే వ్యాస గుహ ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
Advertisement
Advertisements
ఇక్కడ ప్రకృతి అందాలు మంచుతో కప్పబడిన శిఖరాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.ఈ గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ కేవలం 5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.సో హాలిడేకి మీ ఫ్యామిలీతో కలిసి మీరు మనా ప్రాంతాన్ని సందర్శిస్తే ఒకేసారి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూసినట్లు అలాగే సాహసాలు చేసే ఛాన్స్ కూడా మీకు లభిస్తుంది.మరి ముఖ్యంగా ఇది అతితక్కువ బడ్జెట్ తో ఇక్కడికి వెళ్లి వచ్చేయవచ్చు.
Advertisements