Advertisement
నేను నా ఫ్రెండ్…. టెన్త్ నుండి అప్పుడే ఇంటర్ లోకి అడుగుపెట్టాం! నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్ చదువులో యావరేజ్ స్టూడెంట్ యే.! అలా కాలేజ్ నడుస్తున్న రోజుల్లో…. మా క్లాస్ లోని ఓ టాపర్ అమ్మాయితో నా ఫ్రెండ్ కు స్నేహం కుదిరింది! అమ్మాయి టాపర్, అబ్బాయి సో..సో క్యాండెట్!
వారి స్నేహం హద్దులు దాటుతోంది! క్లాస్ టైమ్ కంటే చాలా ముందే వచ్చి బెంచ్ మీద కూర్చొని ఒకరి చేతులు ఒకరి చేతుల్లోకి తీసుకొని ఏవేవో ముచ్చట్లు చెప్పుకునేవారు! ఈ సీన్ క్లాస్ లోని చాలా మందే గమనించేవారు.! లంచ్ టైమ్ లో కూడా వారిద్దరే….గ్యాప్ దొరికితే వాళ్లిద్దరే కనిపించేవారు. వాళ్ల ప్రవర్తన కూడా తేడాగానే ఉండేది!
Advertisement
సెకండ్ ఇయర్ వచ్చే సరికి….వీరి ప్రేమను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. అప్పటికే శారీరకంగా రెండు మూడు సార్లు కలిశారట! అప్పటి నుండి నా ఫ్రెండ్ ప్రవర్తనలో తీవ్ర మార్పులు గమనించాను…ఆ అమ్మాయిని తప్పించుకొని తిరుగుతున్నాడు…తన కారణంగా చదువు మీద ఇంట్రస్ట్ చూపలేకపోతున్నానని…ఆమెతో తగువులాడాడు…ఆమె నువ్వు లేకుండా నేను ఉండలేనంటూ అందరి ముందే అతని గల్లా పట్టుకొని నిలదీసింది….పెద్ద రచ్చ రచ్చ అయ్యింది ఆ మ్యాటర్……..!
Advertisements
అతికష్టం మీద ఇంటర్ పాసైన ఇద్దరు …రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు వేర్వేరుగా కొత్త లవ్ స్టోరీలు మళ్లీ స్టార్ట్ చేశారు.! టాక్సిక్ లవ్ అంటే ఇదే….! అట్రాక్షన్ కు ఎఫెక్షన్ తేడాను గమనించలేకపోవడం….లస్ట్ ను లవ్ గా ఫీల్ అవ్వడం…తర్వాత డిస్ట్రాక్షన్ అవుతున్నాని తెలుసుకోవడం! అందుకే 25 సంవత్సరాల లోపు లవ్ కు దూరంగా ఉంటేనే….ఫ్యూచర్ బాగుటుంది!
Advertisements