Advertisement
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుంటుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ప్రపంచంలోని అరబ్ దేశాల్లో ఒకటైన ఈజిప్టుకు సంబంధించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) విడుదల చేసిన నివేదికల ప్రకారం ఈజిప్టులో 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సున్న 91 శాతం మందిలో జననావయవాలు ఎప్పటికప్పుడు క్షీణిస్తున్నాయట.
ఈజిప్టులోని హెరాక్లియాన్ అనే నగరాన్ని సుమారుగా 1200 ఏళ్ల తరువాత సముద్రం అడుగు భాగంలో ఉన్నట్లు గుర్తించారు.
Advertisements
ప్రపంచంలోని అరబ్ దేశాల్లో ఈజిప్టు అతి పెద్ద దేశంగా ఉంది. అక్కడి జనాభా సుమారుగా 92.1 మిలియన్లు.
ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈజిప్టు 66వ స్థానంలో ఉంది. అక్కడ ప్రతి మహిళ 2.97 మంది పిల్లలకు జన్మనిస్తుండగా.. ఆ జాబితాలో నైజీరియా మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రతి మహిళ ఏకంగా 7.6 మంది పిల్లలకు జన్మనిస్తోంది.
ఆఫ్రికాలో సహజసిద్ధమైన గ్యాస్, ఆయిల్‌లను ఎక్కువగా వాడే దేశంగా ఈజిప్టు పేరుగాంచింది.
Advertisement
ఈజిప్టులో క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం కాలం నాటికి చెందిన పురాతన ఈజిప్టు మహిళ ధరించిన చెక్కతో తయారు చేసిన కృత్రిమ పాదాన్ని గుర్తించారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన డి20 డైస్‌ను ఈజిప్టులో గుర్తించారు. అది క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం కాలం నాటికి చెందినదిగా భావిస్తున్నారు.
ఈజిప్టు మమ్మీల్లో కొకెయిన్, నికోటిన్ ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.
ఈజిప్టు నగరంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న నగరం కైరో. అది ఈజిప్టు రాజధాని.
Advertisements
ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది నైలు నది. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే ఈజిప్టు జనాభా సుమారుగా 95 శాతం వరకు నివాసం ఉంటారు.