Advertisement
బంగ్లాదేశ్.. మన దేశానికి ఆనుకుని ఉన్న దేశాల్లో ఇదొకటి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ముస్లింలే. అయినప్పటికీ వీరు బెంగాలీ భాషను ఎక్కువగా మాట్లాడుతారు. ఇక్కడ నివసించే వారిలో సుమారుగా 98 శాతం మంది బెంగాలీలే. వీరిలో 90 శాతం మంది ముస్లింలు. 8.5 శాతం హిందువులు. మిగిలిన వారు ఇతర మతాలకు చెందినవారు. అయితే బంగ్లాదేశ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- బంగ్లాదేశ్ లో వ్య _ భిచారం చేయడం నేరం కాదు. అక్కడ అది చట్టబద్దమే.! వ్య _ భిచారాన్ని చట్టబద్దం చేసిన పలు ముస్లిం దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఒకటి.
- ప్రపంచంలో అత్యధికంగా అవినీతి ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఒకటి. ఇక్కడ ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ అవినీతి కనిపిస్తుంటుంది.
- ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ 4వ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభా మొత్తం మీద 90 శాతం మంది ముస్లింలే.
- ఆసియాలో ఇతర దేశాల్లో ప్రవహించే అత్యంత పెద్దవైన నదులు బంగ్లాదేశ్‌లోనూ ప్రవహిస్తాయి. అవి గంగా, మేఘన, బ్రహ్మపుత్ర.
Advertisements
Advertisement
- బంగ్లాదేశ్ జాతీయ వంటకంగా అక్కడి హిల్షా చేప మాంసం ప్రసిద్ధిగాంచింది.
- ప్రపంచంలోనే అత్యంత పొడవైన బీచ్ బంగ్లాదేశ్ లో ఉంది. కాక్స్ బజార్ అనే బీచ్ పొడవు సుమారుగా 125 కిలోమీటర్లు.
- ప్రపంచంలో మనిషి పెంచి విస్తరింపజేసిన అత్యంత పెద్దదైన అడవి సుందర్‌బన్స్. ఇది బంగ్లాదేశ్ లో ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీని విస్తీర్ణం సుమారుగా 1,39,500 హెక్టార్లు.
- బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. 1608వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఈ సిటీ జనాభా సుమారుగా 1.7 కోట్లు. దీన్నే City of Mosques అని పిలుస్తారు.
Advertisements
- భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంకలను చుట్టి ఉన్న బంగాళాఖాతం ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రం.
- బంగ్లాదేశ్ ప్రజలు ఎక్కువగా నవ్వరు. ఎందుకంటే వారు నవ్వేవారిని అపరిపక్వత కలిగిన మనుషులుగా భావిస్తారట.