Advertisement
మన దేశంలో ఉన్న అనేక చారిత్రాత్మక నిర్మాణాల్లో ఎలిఫెంటా గుహలు కూడా ఒకటి. ఇవి ముంబైకి తూర్పుగా 10 కిలోమీటర్ల దూరంలోని ఎలిఫెంటా దీవిలో ఉన్నాయి. అయితే నిజానికి ఈ దీవిని ఒకప్పుడు ఘరపురి అని పిలిచేవారు. అప్పట్లో పోర్చుగీసు వారు ఈ దీవికి వచ్చి ఇక్కడ ఉన్న భారీ ఏనుగు విగ్రహాన్ని చూసి ఈ దీవికి ఎలిఫెంటా దీవి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ దీవిని ఆ పేరుతో పిలుస్తున్నారు.
- ఎలిఫెంటా గుహలు క్రీస్తు శకం 6-7 శతాబ్దాలకు చెందినవని చరిత్ర చెబుతోంది.
- సిల్‌హర రాజుల హయాంలో వీటిని నిర్మించారని తెలుస్తోంది.
Advertisements
- చాళుక్య వంశానికి చెందిన పుల్కెసిన్ 2 అనే రాజు తాను సాధించిన విజయానికి గుర్తుగా ఈ గుహల్లో శివుడికి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
- ఈ గుహలు ఉన్న ప్రాంతం మొత్తం విస్తీర్ణం 60వేల చదరపు అడుగులు. ఈ గుహల్లో ఒక ప్రధాన గది, 2 ఇతర గదులు, ప్రాంగణం, పలు విగ్రహాలు ఉంటాయి.
- ఈ గుహలను రాయిని తొలిచి నిర్మించారు.
Advertisement
- గుహల్లో సదాశివ పేరిట పంచముఖ శివుడి 20 అడుగుల విగ్రహం ఉంటుంది.
- ఇదే గుహల్లో మరొక శివుని విగ్రహం అర్థనారీశ్వరుడి రూపంలో ఉంటుంది.
- ఈ గుహల్లో శివుడికి చెందిన మరో విగ్రహం తామర పువ్వుపై ఉంటుంది. ఆయనను యోగీశ్వరుడిగా పిలుస్తారు.
- ఎలిఫెంటా గుహల్లో మొదటి గుహలో ఉండే నిర్మాణ శైలి చూపరులను ఆకట్టుకుంటుంది.
- 1987లో ఎలిఫెంటా గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
Advertisements
ప్రస్తుతం ఈ గుహలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. ఈ గుహల్లో చాలా వరకు శిల్పాలను పోర్చుగీసు వారు ధ్వంసం చేశారు. వారు అప్పట్లో ఆ శిల్పాలతో యుద్ధం ప్రాక్టీస్ చేసేవారు. ప్రతి ఏటా మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో ఇక్కడ డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎలిఫెంటా గుహలను సోమవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులు చూడవచ్చు.