Advertisement
మన దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో కోల్‌కతా కూడా ఒకటి. దీన్ని గతంలో కలకత్తా అని పిలిచేవారు. తరువాత పేరు మార్చారు. పశ్చిమబెంగాల్ రాజధానిగా కోల్‌కతా ఉంది. 1773 నుంచి 1911 వరకు బ్రిటిష్ వారు కోల్‌కతాను భారతదేశ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. కోల్‌కతా నగరంలో భిన్న సంస్కృతులు, వర్గాలకు చెందిన వారు మనకు కనిపిస్తారు. ఈ క్రమంలోనే కోల్‌కతా నగరానికి చెందిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియాలోనే అతి పెద్ద రెడ్ రైట్ ఏరియా సోనగచి కోల్‌కతాలో ఉంది. అక్కడ సుమారుగా 11వేల మంది వరకు సె (se) క్స్ వర్కర్లు నివసిస్తున్నారు. వారందరికీ లైసెన్స్‌లు కూడా ఇచ్చారు.
2006 వరకు కోల్‌కతాలో కోల్‌కతా స్టేషన్ లేదు.
Advertisements
కోల్‌కతాలోని హౌరా రైల్వే జంక్షన్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నిత్యం 974 వరకు రైళ్లు వచ్చిపోతుంటాయి.
కోల్‌కతాలోని బొటానికల్ గార్డెన్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వృక్షం ఉంది. అది మర్రి వృక్షం. దాని చుట్టుకొలత సుమారుగా 330 మీటర్ల వరకు ఉంటుంది.
కోల్‌కతాలో ఉన్న ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా మన దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ లైబ్రరీగా ఉంది.
Advertisement
కోల్‌కతాలో ఉన్న పోలో క్లబ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన క్లబ్‌గా పేరుగాంచింది.
క్యోటో, టోక్యో కాకుండా ఆసియాలో నోబెల్ గెలిచిన 6 మంది కోల్‌కతాకు చెందిన వారే కావడం విశేషం. మదర్ థెరిస్సా, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సీవీ రామన్, సర్ రొనాల్డ్ రాస్‌లు కోల్‌కతాకు చెందినవారు. నోబెల్ గెలిచారు.
కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ ను 1898లో నెలకొల్పారు. దేశంలో అత్యంత పురాతనమైన, ప్రపంచంలో రెండో అత్యంత పురాతనమైన లీగ్‌గా ఇది పేరుగాంచింది.
దేశంలో చేతి రిక్షాలు ఉన్న ఏకైక నగరం కోల్‌కతా.
కోల్‌కతాలోని హౌరా తీగల బ్రిడ్జి ప్రపంచంలోనే 6వ అతిపెద్ద తీగల బ్రిడ్జి కాగా దేశంలో మొదటిది.
Advertisements