Advertisement
సీజన్లతో సంబంధం లేకుండా సహజంగానే మన ఇండ్లలో అప్పుడప్పుడు బల్లులు కనిపిస్తుంటాయి. కొందరికి వాటిని చూస్తే ఎక్కడలేని కంపరం పుట్టుకొస్తుంది. వాటిని చూస్తేనే ఒంటిపై తేల్లు, జెర్లు పాకినట్లు ఫీలవుతారు. కంగారు పడతారు. అయితే బల్లులు మనకు హానికరమైన కాకపోయినా.. అవి మన ఇండ్లలో ఉండే పురుగులు, కీటకాలను తిని మనకు మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే వాటికి చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లులకు తోగ తెగినా మళ్లీ పెరుగుతుందన్న విషయం చాలా మందికి తెలుసు. బల్లులు తమ వద్దకు వచ్చి తమను మింగాలని చూసే ఇతర జీవుల నుంచి తప్పించుకోవడ కోసం అలా తోకలను తమకు తామే తెంపుకుంటాయి. దీంతో ఆ తోక కదులుతుంది. ఆ తోకను చూసి వాటి శత్రువులు వాటి వెంట పడతాయి. లేదా కన్ఫ్యూజ్ అవుతాయి. అదే సమయంలో అదును చూసుకుని బల్లులు అక్కడి నుంచి పరారవుతాయి. అందుకనే అవి తోకలను తెంపుకుంటాయి. ఇక ఆ తోకలు మళ్లీ చాలా త్వరగా పెరుగుతాయి. అయితే తోకలు తెగినా వాటికి నొప్పి అనిపించదట.
ప్రపంచంలోనే అతి పెద్ద బల్లి కొమొడొ డ్రాగన్. ఇది 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. అంత పొడవు పెరిగితే మొసళ్ల కన్నా ఎక్కువ పొడవుగా కనిపిస్తాయి. ఇవి సుమారుగా 70 కిలోల వరకు బరువు తూగుతాయి.
Advertisements
Advertisement
ఊసరవెల్లిలు కూడా బల్లి జాతికి చెందినవే. ఇవి తాము ఉన్న పరిసరాలను, వాతావరణాన్ని, మూడ్ను, తమ శరీర ఉష్ణోగ్రతలను బట్టి రంగులను మార్చుతాయి. చాలా ఎగ్జయిట్ అయినప్పుడు ఇవి ప్రకాశవంతమైన కలర్లోకి మారుతాయి. భయపడినప్పుడు డార్క్ కలర్లోకి మారుతాయి. ఆడ, మగ ఊసరవెల్లిలు రెండు కూడా కలర్లను మార్చగలవు. కాకపోతే మగ ఊసరవెల్లిలు తరచూ రంగులను మారుస్తుంటాయి.
ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,600కు పైగా వివిధ రకాల బల్లి జాతులు ఉన్నాయి.
గెకోస్ అని పిలవబడే బల్లులకు కను రెప్పలు ఉండవు. అందువల్ల అవి కళ్లను తేమగా చేసుకునేందుకు, వాటిని క్లీన్ చేసుకునేందుకు అవి తమ నాలుకలను ఉపయోగిస్తాయి. ఎప్పటికప్పుడు అవి తమ నాలుకలతో కళ్లను తేమగా చేసుకుంటాయి.
హార్న్డ్ అనే బల్లులు తమ కళ్ల నుంచి రక్తాన్ని బయటకు ఒక్కసారిగా బుల్లెట్ మాదిరి షూట్ చేయగలవు. దాన్ని చూసి శత్రు జీవులు పారిపోతాయి.
Advertisements