Advertisement
నేపాల్.. భారతదేశానికి ఆనుకుని ఉన్న దేశం. దీన్నే ఫెడరల్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్ అని కూడా పిలుస్తారు. ఈ దేశంలో ఎక్కువ భాగం హిమాలయ పర్వతాల్లోనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో నేపాల్ ది 49వ స్థానం. మన దేశంలోలాగే నేపాల్‌లోనూ అనేక మతాలు, భాషలకు చెందిన వారు ఉన్నారు. ఇక నేపాల్‌కు చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు పుట్టింది నేపాల్‌లోనే.
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ నేపాల్‌లోనే ఉంది. అలాగే ప్రపంచంలోని ఎత్తైన 10 పర్వతాల్లో 8 పర్వతాలు నేపాల్‌లోనే ఉన్నాయి.
- నేపాల్‌లో దాదాపుగా 6వేలకు పైగా నదులు ప్రవహిస్తాయి.
- నేపాల్‌లో 876 జాతులకు చెందిన పక్షులు కనిపిస్తాయి. లొఫోఫోరస్ అనే పక్షి నేపాల్ జాతీయ పక్షిగా ఉంది.
Advertisements
- అన్ని దేశాలకు చెందిన జాతీయ పతాకాలు దీర్ఘ చతురస్రాకారంలోనే ఉంటాయి. కానీ నేపాల్ జాతీయ జెండా ఒక్కటే భిన్నంగా ఉంటుంది. రెండు త్రిభుజాలను కలిపినట్లు ఉంటుంది.
Advertisement
- నేపాల్ జాతీయ భాష నేపాలీ. కానీ ఈ దేశంలో 123 భాషలను మాట్లాడుతారు.
- నేపాల్ రాజధాని ఖాట్మండు. దీన్నే సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా పిలుస్తారు.
- నేపాల్ దేశానికి స్వాతంత్య్ర దినోత్సవం లేదు. ఎందుకంటే ఇక్కడికి ఇతర దేశాల వారు ఎవరూ వలస వచ్చి ఆక్రమించలేదు.
- నేపాల్ జాతీయ జంతువు ఆవు. ఆవును ఎవరైనా చంపితే అక్కడ వారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.
- నేపాల్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన స్థలాలు 10 ఉన్నాయి.
Advertisements
- ఈ దేశంలో ఏటా కుకుర్ తిహార్ అనే పండుగ జరుపుకుంటారు. ఆ సమయంలో నేపాలీలు కుక్కలను పూజిస్తారు. అవి చూపే స్నేహానికి, విశ్వాసానికి వాటిని పూజిస్తారు.