Advertisement
నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. కానీ వాటికి చెందిన కొన్ని విషయాలు మాత్రం మనల్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. అలాంటి పలు ఆహారాలు, వాటికి చెందిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కోడిగుడ్డును నీటిలో అది మునిగితే అది ఫ్రెష్ గుడ్డు అని…సగం వరకు తేలితే అది వారం రోజులది, పూర్తిగా తేలితే అది చెడిపోయిన గుడ్డుగా అర్థం చేసుకోవొచ్చు ( పచ్చి గుడ్డు మాత్రమే)
2. భోజనం చేసే ముందు ఒక డార్క్ చాకొలెట్ ముక్కను తింటే ఆకలి తగ్గుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు.
Advertisements
3. రెడ్ లేదా ఎల్లో ఫుడ్ కలరింగ్ ఉన్న ఆహారాలు పిల్లలకు ఇవ్వడం మంచిదికాదు. వాటి వల్ల వారు హైపర్ యాక్టివ్‌గా మారుతారు.
4. పిస్తా వంటి నట్స్ ఎక్కువ మొత్తంలో పొట్టుతో ఉన్నప్పుడు అవి మంటలంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నట్స్ ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ను విడిచిపెడతాయి. కనుక వీటిని రవాణా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి తరలించాలి.
Advertisement
5. టెకిలా అనబడే మొక్క నుంచి టెకిలా అనే ఆల్కహాల్ తయారు చేస్తారు. అయితే అదే మొక్క నుంచి వజ్రాలను ఉత్పత్తి చేయవచ్చట. వాటిని ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడవచ్చట.
6. కాఫీ బీన్స్ అంటే నిజానికి అవి బీన్స్ జాతికి చెందినవి కావు. అవి బెర్రీల జాతికి చెందినవి. అవి చూసేందుకు బీన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి వాటికి బీన్స్ అని పేరు వచ్చింది.
Advertisements
7. సన్నగా తురిమిన క్యాబేజీని తీసుకోవడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.