Advertisement
స్వామి వివేకానంద ఎంత గొప్ప మేథావో అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులోనే ఆయన దేశాలను చుట్టి వచ్చారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఆయన చెప్పిన సూక్తులు ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే ఆయన జీవితంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే..
ఒక రోజు స్వామి వివేకానంద వారణాసిలో ఉన్నప్పుడు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆయన ఆలయం నుంచి తిరుగు ముఖం పట్టారు. దారిలో కొన్ని కోతులు ఆయనను వెంబడించాయి. దీంతో ఆయన భయానికి గురై పరిగెత్తారు. అయితే అది చూసిన ఆ కోతులు మరింత రెచ్చిపోయాయి. ఆయనపై దాడిని మరింత ఎక్కువ చేశాయి. ఆయన మీద పడి అవి కొరికాయి. చర్మంపై రక్కాయి.
Advertisement
అయితే తనకు ఎలాంటి సహాయం అందడం లేదని భావించిన స్వామి వివేకానంద నిరాశలో ఉండగా.. వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. కోతుల నుంచి పరిగెత్తడం ఆపు, ధైర్యంగా వాటిని ఎదుర్కో.. అని వెనుక నుంచి ఎవరో అన్నారు. దీంతో ఆయన అలాగే చేశారు. పరిగెత్తడం ఆపి వెనక్కి తిరిగి కోతులను తరిమారు. దీంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. తరువాత ఆయన ఒక సూక్తి చెప్పాడు.
Advertisements
Advertisements
నీపై దాడి చేసే వారిని ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో అలాంటి సంఘటనలు పాఠాలు నేర్పుతాయి. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపో. అలా చేస్తే ఆ కోతుల్లాగే జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు మన వెనకబడి వెళ్లిపోతాయి.