Advertisement
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.! ఎన్నో అరుదైన రికార్డ్స్ కూడా నమోదవుతూ ఉంటాయి! ఇలా మా దృష్టికొచ్చిన 5 వింత విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం.!
షార్టెస్ట్ సిక్స్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్ లో బ్యాక్ స్వీప్ షాట్ అడాడు.ఆ బాల్ బౌన్స్ అయ్యి వికెట్ కీపర్ తల పై నుండి వెళ్లి దూరంగా ఉంచిన తన హెల్మెట్ కు తగిలింది.ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో అంపైర్ వెంటనే ఆ బ్యాటింగ్ టీంకు ఐదు పరుగులు ఇచ్చాడు.అప్పటికే వారు ఒక పరుగు తిరిగుండడంతో ఆ బాల్ వల్ల బ్యాటింగ్ టీంకు మొత్తం ఆరు పరుగులు లభించాయి.దీన్ని క్రికెట్ హిస్టరీలో షార్టెస్ట్ సిక్స్ సిక్స్ గా వర్ణించారు.
అతి చిన్న టెస్ట్ మ్యాచ్ : 1932 లో ఆస్ట్రేలియా,సౌత్ ఆఫ్రికా మధ్య ఓ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ కేవలం 5 గంటల 53 నిమిషాలలో పూర్తయి హిస్టరీలో అతి చిన్న టెస్ట్ మ్యాచ్ గా రికార్డ్ ను నమోదు చేసుకుంది.ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 23.2 ఓవర్స్ ఆడి కేవలం 36 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.ఆతరువాత లీడ్ సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో 72 పరుగులతో విజయం సాధించింది.
మోస్ట్ డక్ ఔట్స్ : శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ జయసూర్య 34 సార్లు డక్ ఔట్ ( అసలు స్కోర్ చేయకుండా ఔట్ అవ్వడమని అర్థం) అయ్యారు.ODI మ్యాచ్ లలో ఎక్కువ సార్లు డక్ ఔట్ అయిన ప్లేయర్ గా ఈయన రికార్డ్ సృష్టించారు. 29 సార్లు డక్ ఔట్ అయ్యి పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆతర్వాత స్థానంలో నిలిచారు.
Advertisements
Advertisement
49వ యేట అరంగ్రేటం : ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ జేమ్స్ సౌథర్టన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తన 49వ యేట అరంగ్రేటం చేశారు. ఈయన తన ఇంటర్నేషనల్ కెరియర్ లో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్ లు ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు.ఆతర్వాత వయసు వల్ల కలుగుతున్న ఇబ్బందుల వల్ల క్రికెట్ కు దూరమయ్యారు.
24 గంటలలో మూడుసార్లు ఔట్ అయిన బ్యాట్స్ మెన్ : పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్ 24 గంటలలో మూడుసార్లు ఔట్ అయ్యాడు.మొదట ఇంగ్లాండ్ తో జరిగిన టి20 లో బ్యాటింగ్ చేసిన ఉమర్ అక్మల్ 9 బాల్స్ కు 4 రన్స్ కొట్టి వికెట్ ను కోల్పోయాడు.ఆతరవాత మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన ఉమర్ అక్మల్ జోర్డాన్ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు.మ్యాచ్ పూర్తవ్వడంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడడానికి దిగిన ఉమర్ అక్మల్ 8 బాల్స్ ఆడి కేవలం 1 పరుగు చేసి వికెట్ కోల్పోయి. 24 గంటలలో మూడుసార్లు ఔట్ అయిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు.
Advertisements