Advertisement
హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన తెలుగు రాష్ట్రాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు… కచ్చితంగా సమయం దొరికితే అన్ని ప్రాంతాలు చూసి వచ్చేస్తారు. పర్యాటక, చారిత్రాత్మక ప్రదేశాలకు హైదరాబాద్ నిలయం. అద్భుతమైన కట్టడాలకు హైదరాబాద్ నిలయంగా ఉంది. ఇక హైదరాబాద్ లో ఎవరికి సరిగా తెలియని ప్లేస్ ఒకటి ఉంది.
Also Read:రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!
ఆనంద బుద్ధ విహార ట్రస్ట్ గురించి తెలియదు చాలా మందికి. ఇది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ గుట్ట పై చివరన ఉంటుంది. ఆదివారం వెళ్ళాలి అనుకుంటే సాధ్యం కాదు. శనివారం మధ్యాహ్నం నుంచి మూసి వేస్తారు. ఇతర సమయాల్లో దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రశాంతమైన బుద్ధ విగ్రహం, నిశ్శబ్దమైన పరిసరాలు, రమణీయమైన ప్రకృతి ఇక్కడ మనకు కనపడతాయి.
Advertisement
Advertisements
ఈస్ట్ మారేడ్ పల్లి మెయిన్ రోడ్డు నుంచి వీలైతే నడుచుకుని వెళితే చూడటానికి, మనసుకి మంచి ఆహ్లాదంగా ఉంటుంది. ఇక దార్లో ఓ అందమైన కోవెల కూడా ఒకటి ఉంటుంది. ఇక దారిలో ఉండే టీ షాప్స్ లో దొరికే టీ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇక్కడ బౌద్ధ సాహిత్యానికి చెందిన అద్భుతమైన పుస్తకాలు కూడా మనకు పూర్తిగా దొరుకుతాయి. ఆసక్తి ఉన్నవారు కొంత డబ్బు ట్రస్ట్ కు వితరణ చేసి ఆ పుస్తకాలు కూడా తెచ్చుకోవచ్చు. ఇక ఆ గుడి పై నుంచి నగరదర్శనం కూడా సుందరంగా ఉంటుంది.
Advertisements