Advertisement
మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు సక్సెస్ కావడం లేదనే విషయం చాలా మందికి తెలుసు. దానికి మన వాళ్ళ అతి ఆలోచనే కారణం అని చెప్తే ఇండియన్స్ ని అవమానించారు అని దేశ భక్తి ప్రదర్శిస్తారు గాని… అసలు మన దేశంలో ఫేస్బుక్ లాంటి యాప్ ఎందుకు తయారు కాలేదు…? వంద కోట్ల మందిలో ఒక్కరికి కూడా ఆ ఆలోచన ఎందుకు రాలేదు…?
Also Read:బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?
ఫేస్బుక్ అసలు ఎందుకు హిట్ అయిందో ఒక్కసారి చూద్దాం. ఫేస్-బుక్ ఒక స్ట్రాటజీ ని ఫాలో అయింది అని చెప్పాలి. యాప్ ని ఫ్రీ గా ఇవ్వడం అనే ఆలోచన ఫేస్బుక్ ని బాగా క్లిక్ చేసింది. ఇండియాలో ఎక్కువ శాతం మంది ఇలా ఫ్రీ గా ఇవ్వాలి అన్ని ఆలోచన పెట్టుకునే ఛాన్స్ లేదు. ప్రతీ దాంట్లో ఎంతో కొంత వసూలు చేసుకోవాలి, పెట్టిన పెట్టుబడి నెలల్లో రావాలి అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారు.
Advertisement
Advertisements
ఫేస్-బుక్ రిలీజ్ అయ్యేనాటికి Orkut కి జనాలు బాగా అలవాటు పడ్డారు. జీవితంలో ఒక భాగంలా మారిపోయింది అది. అలాంటి ఒక యాప్ ఫుల్ ఫాం లో ఉన్నప్పుడు అలాంటిదే మరొకటి రావడం అంటే సాహసం. కాని ఫేస్-బుక్ ఆ పని చేసి నిలబడింది. అంత సాహసం చేసే ఆలోచన పెద్దగా చేయరు. ఫేస్-బుక్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చినా సరే దాదాపు 6 సంవత్సరాల పాటు ఎదురు పెట్టుబడి మీదనే ముందుకు వెళ్ళింది. ఫేస్బుక్ దెబ్బకు ఆర్కుట్ కూడా మూసేశారు.
Advertisements
Also Read:సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?