Advertisement
ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు అంటే డబ్బులు ఇచ్చి తమకు నచ్చిన విధంగా ప్రశ్నలు, సమాధానాలు ఉండే విధంగా ప్లాన్ చేసినట్టు ఉంటాయి. గతంలో ఇంటర్వ్యూలు అంటే మాత్రం కచ్చితంగా షేక్ చేస్తాయి అనే భయం ఉండేది. కొందరు జర్నలిస్ట్ ల ఇంటర్వ్యూలు అంటే ఉక్కపోతే. అలాంటి ఒక జర్నలిస్ట్ కరణ్ థాపర్.
Also Read:ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన కొన్నాళ్ళకు దొరికితే ఏం జరుగుతుంది…?
ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ, మాజీ సిఎం లు చంద్రబాబు నాయుడు, జయలలిత, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలకు ఆయన ప్రశ్నలు చెమటలు పట్టించాయి. కరణ్ థాపర్ జవహర్ లాల్ నెహ్రూకు కూడా దూరపు బంధువు అవుతారు. మంచి మేధావుల, విద్యావంతుల ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆయన… ఇంటర్వ్యూ చేస్తే రాజకీయ భవిష్యత్తు మీద కూడా ప్రభావం పడుతుందని భయపడే వారు.
Advertisement
ది డెవిల్స్ అడ్వొకేట్ అని కొన్ని ముఖాముఖి కార్యక్రమాలు చేయగా అందులో నరేంద్ర మోదీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జయలలిత లాంటి ప్రముఖు నేతలు కూడా ఉన్నారు. చాలా అగ్రెసివ్ గా, సూటిగా ప్రశ్నలు ఉండటమే కాకుండా పక్కా ఆధారాలతో పేపర్లు పక్కన పెట్టుకుని ప్రశ్నలు అడుగుతాడు. నరేంద్ర మోదీ ఈయన ఇంటర్వూలో కేవలం మూడే నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోగా… జయలలిత కనీసం ఆయనకు నమస్కారం కూడా పెట్టలేదు. బిజెపి నేతలు ఎవరూ ఆయనకు ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేయరు.
Advertisements
Advertisements
Also Read:అసలు మైసూరు బజ్జీ ఎక్కడ పుట్టింది…? నిజంగా మైసూరు నుంచే వచ్చిందా…?