Advertisement
శశి థరూర్” ఇండియాలో అత్యంత బలమైన రాజకీయ నాయకుడు. ఏ విషయంలో అయినా సరే ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని అంటూ ఉంటారు. కేరళలోని త్రివేండ్రం నుంచి ఎంపీ గా పని చేస్తున్న ఆయన ఓడిపోయిన సందర్భాలు కూడా లేవు. ఇక కాంగ్రెస్ లో ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక వివాదాల చుట్టూ అమ్మాయిల చుట్టూ ఆయన చక్కర్లు కొడుతూ ఉంటారు.
Also Read:ఈ తరం ప్రేక్షకులకు తెలియని ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు…!
సునందా పుష్కర్ వ్యవహారంలో ఆయన బయటకు వచ్చిన విధానం ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇక అది అలా ఉంచితే… ఆయన మాట్లాడే ఇంగ్లీష్ చాలా అందంగా ఉంటుంది. బహుశా ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు అలా మాట్లాడలేరు అనడంలో సందేహం లేదు. అసలు ఆయన చదివిన చదువులు ఏంటీ… ఆయన నేపధ్యం ఏంటీ ఒక్కసారి చూద్దాం. ఆయన పుట్టింది లండన్ లో , ఉన్నత తరగతి కుటుంబంలో. ఇక ఆయన తండ్రి విషయానికి వస్తే… The Statesman పత్రికలో అడ్వర్టైజింగ్ మేనేజర్ గా పనిచేసేవారు.
Advertisement
Advertisements
ప్రఖ్యాత ‘రీడర్స్ డైజెస్ట్’ ఇండియా వ్యవస్థాపకుడు శశి థరూర్ కు సొంత బాబాయ్. డిగ్రీ వరకు ఆయన ముంబై లో… అత్యున్నత విద్య సంస్థల్లో. అమెరికాలో రెండు ఎమ్మేలు కూడా చేసారు ఆయన. శశి థరూర్ 22 ఏళ్లకే డాక్టరేట్ పట్టా కూడా పొందడం విశేషం. పుస్తకాలు చాలా బాగా చదివే అల్లవాటు ఉంది ఆయన సొంతం. ఉపన్యాసాలు ఇవ్వడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఐఖ్యరాజ్య సమితిలో పని చేయడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది.
Advertisements
Also Read:పచ్చి మిర్చి ఉపయోగాలు ఏంటీ…? బరువు తగ్గే వారికి ఎలా ఉపయోగపడుతుంది…?