Advertisement
ఏ మాటకు ఆ మాట రాయలసీమ యాస కు మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రాయలసీమ యాస లో మాట్లాడే మాటలకు చాలా మంది ఆకర్షితులు అవుతారు. అందుకే సినిమా దర్శకులు సైతం ఆ భాష కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనే మాట వాస్తవం. అయితే ఆ యాసలో మాత్రమే ఉన్న పదాలు కొన్ని ఇతర యాసలలో ఉండవు. అవి ఏంటీ అనేది ఒక్కసారి చూద్దాం.
Also Read:ఏటీఎంలో నకిలీ కరెన్సీ వస్తే ఏం చేయాలి…?
Advertisement
యాల అంటే ఎందుకు అని అర్ధం వస్తుంది. ఆ మీటికి అంటే తరువాత అని అర్ధం అన్నట్టు. పాత్తర్లు=గిన్నెలు అని అర్ధం. బిరీన అంటే తొందరగా అని మనం అర్ధం చేసుకోవాలి. తొందర అంటే ఇబ్బంది అన్నట్టు. బచ్చలి అంటే బాత్‌రూం అని అర్ధం. చల్లడం అంటే కింద పడేయడం అని మీనింగ్ అన్నట్టు. గుడ్డం అంటే గుట్ట అని అర్ధం. ఊరుబిండి అంటే పచ్చడి అని అర్ధం.
పెరుగు బజ్జీ అంటే పెరుగు పచ్చడి అని అర్ధం వస్తుంది. బ్యాళ్ళు అంటే పప్పులు అని అర్ధం చేసుకోవాలి. చెనిక్కాయి విత్తనాలు అంటే పల్లీలు అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఊరుగాయి అంటే ఆవకాయ అని అర్ధం. ఊరుగాయ అనేది తెలంగాణాలో కూడా వాడుతూ ఉంటారు. ఇలాంటి పదాలు చాలానే ఉన్నాయి సీమలో. వాటిని అర్ధం చేసుకోవాలంటే కొత్త బాష నేర్చుకున్నట్టే.
Advertisements
Advertisements
Also Read:కరెంట్ షాక్ కొడితే ఏం జరుగుతుంది…?