Advertisement
యువరాజ్ సింగ్” అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగిన ఆటగాడు. ఇండియన్ క్రికెట్ టీంలో ఒకప్పుడు అత్యంత కీలక ఆటగాడిగా తనదైన పాత్ర పోషించిన యువీ… మూడు దశాబ్దాల తర్వాత ఇండియా టీం ప్రపంచ కప్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. అయితే క్యాన్సర్ రావడం అతని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఆరంభంలో జుట్టు కీలకమైన వికెట్లు కోల్పోయిన ప్రతీసారీ తాను విరోచితంగా పోరాడి ఎన్నో విజయాలను అందించాడు యువీ.
Also Read:జున్ను పాలు అమెరికాలో ఉంటాయా…? వాటిని ఇంగ్లీష్ లో ఏం అంటారు…?
ముఖ్యంగా చక్కని టైమింగ్ తో కొట్టే సిక్సర్ మాత్రం చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇక ఫీల్డింగ్ విషయంలో కూడా అతను ఎన్నో సంచలన క్యాచ్ లు పట్టాడు. ఇక యువరాజ్ గురించి తెలియని విషయాలు ఒకసారి చూస్తే…
Advertisement
Advertisements
1.యువరాజ్ పుట్టిన తేది 12వ తారీఖు 12వ నెల. 12- జెర్సీ నంబర్ 12 బంతులు- యువరాజ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టడానికి తీసుకున్నవి.
2. మూడు వరల్డ్ కప్ లలో కీలకపాత్ర పోషించాడు
2000 – అండర్ 19 లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్
2007 – T20 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్
2011 – వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్.
క్యాన్సర్ నుంచి కోలుకుని, క్యాన్సర్ బాధితుల సహాయార్థం YouWeCan ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది కి సేవలందిస్తున్నాడు యువరాజ్. క్రికెట్ లోనే కాదు నిజ జీవితంలో కూడా మనసున్న వ్యక్తి గా అందరి అభిమానాన్ని పొందాడు యువీ.
Advertisements
Also Read:ఇడ్లీ పిండి ఎందుకు ఉబ్బుతుంది…? పాలు పెరుగు అవ్వాలి అంటే ఏ బ్యాక్టీరియా కావాలి…?