Advertisement
ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నది జీయర్ అనే పేరు. పెద్ద జీయర్, చిన్న జీయర్ అనే మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. తెలంగాణా సిఎం కేసీఆర్ జీయర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ జియర్లు ఏంటీ…? అసలు జీయర్ అని ఎందుకు అంటారు…?
Also Read:అర్హత లేకపోయినా ఇండియా క్రికెట్ టీంలో ఉన్న ఆటగాళ్ళు…!
చిన్న జీయర్ స్వామి అని ఒకరిని… పెద్ద జీయర్ అని ఒకరిని అంటూ ఉంటాం. శ్రీవైష్ణవ (విశిష్టాద్వైత) సాంప్రదాయంలో సన్యాసి ని జీయర్/జీయంగార్ అని పిలుస్తారు. ఒకే మఠంలో గాని లేదా ఒకే క్షేత్రంలో ఇద్దరు జీయర్లుంటే వారిని గుర్తించే సంధర్భం లో వారిరువురిలో పెద్ద వారినీ పెద్ద జీయరనీ, చిన్న వారిని చిన్న జీయర్ అనీ అనడం జరుగుతుంది. కాని త్రిదండి నారాయణ చినజీయర్ గారి విషయం అలా కాదు.
Advertisement
Advertisements
వారి పీఠంలో వారి కంటే ముందున్న జీయర్ ను పెద్ద జీయర్ అనడం సాధారణం కావడం విశేషం. కాని యదార్ధానికి శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మణవాల మహామునులనే ఒక్కరిని మాత్రమే పెరియ(పెద్ద) జీయంగార్ అనడం గురు పరంపరలో ఉన్న విధానం. ఇప్పుడు జీయర్ లకు ప్రాధాన్యత పెరగడం కాస్త ఆసక్తిగా మారింది. ఇటీవల చిన జీయర్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, సిఎం లు వెళ్ళారు.
Advertisements
Also Read:క్రికెటర్లకు ఫీల్డింగ్ టైం లో దెబ్బలు తగలకుండా ఏం చేస్తారు…? పేస్ బౌలర్లు అక్కడ ఎందుకు నిలబడరు…?