Advertisement
క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడనమ్మకాల విషయంలో చాలా సందేహాలు ఉన్నా కొందరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాంటి మూడ నమ్మకాలు ఒక్కసారి చూసేద్దాం. మీరు ఎప్పుడైనా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే సమయంలో ఆయన భార్య రితికను గమనించారా…? రోహిత్ ఆడే ప్రతీ మ్యాచ్ కు మైదానానికి వచ్చే రితిక… తన రెండు చేతి వేళ్ళను ముడుచుకుని కూర్చొంటారు .
Also Read:ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?
అలా ముడుచుకుని కూర్చొన్నప్పుడు రోహిత్ ఒకసారి సెంచరీ చేసాడట. దీనితో ఆమె అది సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక సచిన్ విషయానికి వస్తే… సచిన్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ మీద పగుళ్ల పైన బంతి పడి టర్న్ అవ్వకుండా బ్యాట్ తో సరి చేస్తూ ఉంటాడు. బ్యాట్ తో ఎంత సరిచేసినా పగుళ్లు కవర్ అవ్వవు గాని… క్రికెట్ లో అది ఒక మూడ నమ్మకంగా మారింది.
Advertisement
Advertisements
అలా చేస్తే… బ్యాట్స్మెన్ లో విశ్వాసం పెరుగుతుంది, బౌలర్ బంతిని ఆ ప్రాంతంలో వేయకుండా ఉంటాడని కొందరు క్రికెటర్ లు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. సచిన్ నుంచే ఇది ఎక్కువగా వచ్చింది. ఇక ఇది తెలియని పిల్లలు క్రికెట్ ఆడే సమయంలో గచ్చు మీద కూడా బ్యాట్ తో కొడుతూ ఉంటారు. ఇక సచిన్ కు అయితే అలా కొట్టిన తర్వాత ఫోర్ కొడతాను అనే నమ్మకం ఉండేదట.
Advertisements
Also Read:హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!