Advertisement
డీ మార్ట్” సామాన్యులకు అత్యంత చేరువైన సంస్థ. తక్కువ ధరలో వస్తువులు, ఏది కావాలన్నా సరే దొరికే వెసులుబాటు, అనేక ఆఫర్లు, కొత్త కొత్త వస్తువులు ఇలా ఉంటాయి. రిటైల్ రంగంలో ఎన్నో మార్ట్ లు వచ్చినా సరే డీమార్ట్ మాత్రం ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. అసలు ఆ సంస్థ ఏ విధంగా సక్సెస్ అయిందో ఒక్కసారి చూసేద్దామా…?
రిటైల్ దుకాణాలకు కొన్ని ఖర్చులు బాగా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పేది దుకాణం ఉండే లోకేషన్ ఖర్చు, ఉద్యోగుల ఖర్చు, నిర్వహణ ఖర్చు, ఉత్పత్తుల ఖర్చు. ఈ నాలుగు అంశాలలో డీమార్ట్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. వారు ఎక్కడా కూడా అద్దెకు అనే ఆలోచన చేయరు. ఒక స్థలం కొనేసి అక్కడ సొంతగా వాళ్ళ మార్ట్ ఏర్పాటు చేస్తారు. డీమార్ట్ హిస్టరీ చూస్తే అన్నీ కూడా సొంత భవనాలే ఉంటాయి.
Also Read: అండమాన్ జైలు అంత భయంకరమా…? ఖైదీలకు నిద్ర ఉంటుందా…?
రానున్న కాలంలో 100% సొంత భవనాలకు మారిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనితో అద్దెలు, భూస్వామి డిమాండ్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘ కాలం వ్యాపారం చేసుకోవచ్చు. ఇక అక్కడ ఉండే ఇంటీరియర్లు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. అందుకోసం చాలా తక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక బిల్లింగ్ కౌంటర్లు కూడా తక్కువగా ఉండటం, అన్ని వస్తువులకు ధరలు అక్కడే ఉండటం, అన్నీ కళ్ళ ముందే ఉన్నట్టు ఉండటంతో సపోర్ట్ స్టాఫ్ చాలా తక్కువ. వారిలో ఎక్కువగా శాశ్వత ఉద్యోగులు ఉండరు. కాంట్రాక్ట్ పద్దతిలోనే నియమిస్తారు.
Advertisements
Advertisement
అమ్మే వస్తువులు అన్నీ కూడా ఎక్కువగా అమ్ముడుపోయేవి మాత్రమే. ఆహారం, ఆహార మరియు సౌందర్య సంబంధ FMCG సరుకులు (నూడుల్స్, బిస్కెట్లు, సబ్బులు, పేస్టులు, వగైరా), దుస్తులు వంటివి స్పీడ్ గా అమ్ముడుపోతూ ఉంటాయి. డీమార్ట్‌లో అమ్మే ఉత్పత్తులన్నీ నేరుగా తయారీదారుల నుండే కొనుగోలు చేయడంతో మధ్యవర్తి అనే మాట ఉండదు. హోల్‌సేలర్లు, డీలర్లు అనే మాట ఉండదు. కాబట్టి ఎంఆర్పీ ధర ఉండదు… వాళ్ళు నిర్ణయించిన ధరే.
తక్కువ మార్జిన్ కు వస్తువులను విక్రయించాలి అనే సిద్దాంతంలో ముందుకు వెళ్తారు. అలా అమ్మడంతో ఎక్కువ వస్తువులను అమ్మే అవకాశం ఉంటుంది. ఎక్కువ వస్తువులు అమ్మితే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లీటర్ రిఫైన్డ్ నూనె కిరాణా కొట్టులో 130 రూపాయలకు అమ్మితే అక్కడ కేవలం 110 రుపాయలే. అందుకే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అక్కడికి వెళ్తారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఉండటంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇక వాళ్ళు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే ఉత్పత్తి దారుకి వేగంగా పేమెంట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వస్తువులను సరఫరా చేసే అవకాశాలు ఉంటాయి.
Advertisements
Also Read: బాదం పప్పులు ఆరే తినాలా…? ఎక్కువ తింటే వచ్చే వ్యాధి ఏంటి…?