Advertisement
ట్రైన్ జర్నీలను ఇష్టపడే వాళ్లు….మీ వీలును బట్టి ఇక్కడ చెప్పబడిన 7 రైల్వే ప్రయాణాలను చేసే ప్రయత్నం చేయండి. ఈ రూట్లలో మీరు చేసే ప్రయాణం మీకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి. ప్రకృతి రమణీయత, వాతావరణ మార్పులు, పొంగిపొర్లే వాగులు….అబ్బో ఎంతో ఎగ్జైట్మెంట్ ఈ ప్రయాణాల్లో మీకు దొరుకుతుంది!
1. ముంబై – గోవా:
ఈ మార్గం సొరంగాలు, వంతెనలు, తీరప్రాంతాలు, పశ్చిమ కనుమల గుండా సాగుతుంది.! పచ్చిక భూములు నుండి సుందరమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంది. ప్రయాణ సమయం -14 గంటలు
2.మాథరన్ – నెరల్ పాస్:
Advertisements
భారతదేశంలోని ఉత్తమ రైలు మార్గాలలో ఇది ఒకటి. భయంకర ఘాట్ల గుండా ప్రయాణం. ప్రయాణం సమయం -2 గంటలు.
3. రత్నగిరి – మంగుళూరు :
దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్దులను చేసే రూట్ ఇది! ప్రయాణ సమయం – 10 గంటలు.
4. మండపం – రామేశ్వరం :
పంబన్ ద్వీపంలోని రామేశ్వరం ఆహ్లాదం మరియు ప్రశాంతతకు మారుపేరు.! భారతదేశంలోని రెండవ పొడవైన వంతెన అయిన పాల్క్ స్ట్రెయిట్ మీదుగా రామేశ్వరం వెళుతుంది.. ప్రయాణ సమయం – – 1 గంట
Advertisement
5.మెట్టుపాళ్యం – ఊటీ :
1908 నుండి ఊటీకి ట్రైన్ నడుస్తోంది… నీలగిరి పర్వతం, పెద్దపెద్ద పైన్, ఓక్ మరియు యూకలిప్టస్ అడవులు, వంపులు మరియు సొరంగాల గుండా ట్రైన్ జర్నీ ఓ అద్భుత అనుభవాన్నిస్తుంది! ప్రయాణ సమయం 5 గంటలు
6 . గువహతి – సిల్చర్ :
ఈ ప్రయాణం జటింగా నది, పచ్చని అస్సాం లోయ, తేయాకు తోటలు మరియు హఫ్లాంగ్ లోయ ద్వారా ఉంటుంది! భారతదేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలలో ఇది ఒకటి. రైలు ప్రయాణ సమయం – 10 గంటలు.
7. బెంగుళూరు – కన్యాకుమారి :
దక్షిణ భారతదేశం అందాలను ఈ జర్నీలో చూడొచ్చు. అందమైన పల్లెటూర్లు, తోటలు, పచ్చని పచ్చిక భూములు, వాగులు…..ఈ జర్నీ ఖచ్చితంగా మీకు మాల్గుడి డేస్ ను గుర్తు చేస్తుంది. రైలు జర్నీ సమయం- 15 గంటలు.
Advertisements