Advertisement
IPL…… సిక్సుల మోత, సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ ల నడత, యువకుల ఆల్ రౌండ్ ప్రదర్శన.. బౌన్సర్లతో, యార్కర్లతో హాడలెత్తించే బౌలర్లు…లేటుగా స్టార్ట్ అయినా ఈ సారి IPL అసలైన మజాను అందిస్తుంది. మరి ఇలాంటి IPL కోసం…ప్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్స్ కోసం కోట్లలో ఖర్చు చేసింది. ఈ IPL లో ఎక్కువ రేట్ పలికిన 10 మంది బ్యాట్స్ మన్స్ గురించి చూద్దాం!
కోహ్లీ -17 కోట్లు:
Royal Challengers Bangalore (RCB) కెప్టెన్ అయిన కోహ్లీ తన టీమ్ కు మాత్రం కప్ ను అందించలేకపోయాడు! ఈ సారైనా రాత మారుతుందేమో చూడాలి. ఈ టోర్నీలో ఇప్పటి వరకైతే తనదైన ప్రదర్శన చేయలేదు కోహ్లీ!
ధోని-15 కోట్లు:
3 IPL కప్ లను తన టీమ్ కు అందించిన ధోని రేటు 15 కోట్లు! ధోని కూడా ఈ టోర్నిలో తనదైన రిథమ్ లోకి ఇంకా రాలేదనే చెప్పాలి!
Advertisements
రోహిత్ శర్మ-15 కోట్లు:
ముంబాయ్ ఇండియన్ స్కిప్పర్….మోస్ట్ సక్సెస్ ఫుల్ IPL కెప్టెన్ గా పేరుగాంచాడు.ఇప్పటివరకు 4 సార్లు కప్ ను గెలిచాడు. ఈ సారి కూడా ముంబాయ్ మంచి విజయాలతో దూసుకుపోతుంది!
డేవిడ్ వార్నర్ -12.5 కోట్లు :
ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ హైద్రాబాద్ సన్ రైజర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.!
స్టివ్ స్మిత్ – 12.5 కోట్లు:
ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు…రాజస్తాన్ రాయల్స్ ను కెప్టెన్ గా ముందుకు నడిపిస్తున్నాడు.!
Advertisement
ఎబి డివిలియర్స్- 11 కోట్లు:
విదేశీ ఆటగాళ్లు ఇండియన్స్ అమితంగా ఇష్టమైన ఆటగాడు ఎబిడి..మిస్టర్ 360గా పేరుగాంచిన ఎబి కోహ్లీ పార్టనర్ గా బెంగుళూరు కు ఆడుతున్నాడు.
మనీష్ పాండే -11 కోట్లు:
ఇండియన్ యంగ్ ప్లేయర్ మనీష్ పాండే పై సన్ రైజర్స్ 11 కోట్ల పెట్టింది. బ్యాటింగ్ తో పాటు చురుకైన ఫీల్డింగ్ తో ఆకట్టుకుంటున్నాడు ఈ యంగ్ ప్లేయర్.
లోకేష్ రాహుల్ -11 కోట్లు:
పంజాబ్ జట్టు కెప్టెన్ ., ఈ టోర్నీలో మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు.ఈ సారి ఈ టీమ్ కి కప్ కొట్టేలా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హార్ధిక్ పాండ్యా-11 కోట్లు:
ముంబాయి కి ఆడే హార్ట్ హిట్టర్ హార్ధిక్ పాండ్యాపై ముంబై యాజమాన్యం 11 కోట్లు ఖర్చు పెట్టింది. పైసా వసూల్ ఆడగాడు…అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అధనంగా ఫీల్డింగ్ లో మెరుపు .
గ్లెన్ మ్యాక్స్ వెల్ -10.75 కోట్లుL
పంజాబ్ కు ఆడే ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ …ఈ టోర్నీలో ఇప్పటి వరకైతే భారీ ఇన్నింగ్స్ ఆడలేదు..ఫామ్ లేక తెగ ఇబ్బంది పడుతున్నాడు!
Advertisements