Advertisement
క్రికెట్ అంటేనే కాసుల క్రీడా….పైగా IPL అంటే పక్కా కమర్షియల్ గేమ్….అందుకే హార్డ్ హిట్లర్లకు , వికెట్లు తీసే బౌలర్లకు యమ క్రేజ్ ఉంటుంది! కోట్లకు కోట్లు పెట్టి మరీ వారిని కొనుక్కునేందుకు ప్రాంచైజీలు పోటీ పడుతుంటాయి. ఈ IPL లోని 8 టీమ్స్ కు కెప్టెన్స్ గా వ్యవహరిస్తున్న వారి కోసం ప్రాంచైజీలు ఎంత పెట్టి కొనుగోలు చేశారో చూద్దాం!
విరాట్ కోహ్లీ: 17 కోట్లు
RCB విరాట్ ను 17 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. IPL స్టార్టింగ్ నుండి కోహ్లీ RCB కే ఆడుతున్నాడు. IPL లోనే ఎక్కువ రేట్ కు అమ్ముడుపోయిన ఆటగాడు కోహ్లీనే! ఎలాంటి పరిస్థితుల్లో అయిన బ్యాటింగ్ చేయడం అతని టాలెంట్.
రోహిత్ శర్మ: రూ. 15 కోట్లు
MI రోహిత్ శర్మను 15 కోట్లకు పెట్టి కొనుగోలు చేసింది. రోహిత్ కెప్టెన్సీలో MI నాలుగుసార్లు టైటిల్లను గెలిచింది. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు. హార్ట్ హిట్టింగ్ ఇతని ప్రత్యేకత!
Advertisements
ధోని: రూ. 15 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ధోనిని 15 కోట్లకు కొనుగోలు చేసింది. 3 సార్లు ఛాంపియన్స్, 5 సార్లు రన్నరప్ గా నిలిచిన రికార్డ్ CSK ది.! 2008 నుండి ధోని ఈ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. తెలివైన నిర్ణయాలు, ధనాధన్ భ్యాటింగ్ ధోని ప్రత్యేకత.
స్టీవ్ స్మిత్: రూ. 12 కోట్లు
స్టీవ్ స్మిత్ ను 2018లో … రాజస్థాన్ రాయల్స్ (RR) 12 కోట్లకు వేలంలో గెలుచుకుంది. అయితే ఒక సంవత్సరం నిషేధం కారణంగా అతను తన వేతనాన్ని కోల్పోయాడు. స్మిత్ 2019 సంవత్సరంలో ఐపీఎల్‌లో జట్టు కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు.
Advertisement
డేవిడ్ వార్నర్: రూ. 12 కోట్లు
హైద్రాబాద్ సన్ రైజర్స్ (SRH) వార్నర్ ను 12 కోట్లు పెట్టి కొనుక్కుంది.! 2019 లో ఆరెంజ్ క్యాప్ హోల్టర్ వార్నరే.! దూకుడైన బ్యాటింగ్ ఇతని ప్రత్యేకత!
కెఎల్ రాహుల్: రూ. 11 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) కెఎల్ రాహుల్‌ను రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. నిలకడైన బ్యాటింగ్ , టీమ్ ను సమన్వయం చేయడంలో రాహుల్ కు మంచి పేరుంది..ఈ సీజన్ లో ఇప్పటి వరకు టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
దినేశ్ కార్తీక్: రూ. 7.4 కోట్లు
వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ గా మంచి పేరున్న దినేష్ కార్తీక్ ను KKR 7.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్ స్టార్టింగ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన డీకే ఇప్పుడు తన బాధ్యతలను మోర్గాన్ కు ఇచ్చాడు.!
శ్రేయాస్ అయ్యర్: రూ. 7 కోట్లు
శ్రేయాస్ అయ్యర్‌ను డెల్లీ క్యాపిటల్స్ ( DC ) 7 కోట్లకు వేలంలో గెలుచుకుంది. యంగ్ ప్లేయర్ గా టీమ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు అయ్యర్!
Advertisements