Advertisement
బీసీసీఐ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం ఐపీఎల్ 13వ ఎడిషన్ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఈసారి టోర్నీని దుబాయ్‌కి మార్చారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 8 జట్లు కీలకంగా ఉన్నాయి. మొదట్నుంచీ ఇవి కొనసాగుతున్నాయి. అయితే ఆయా ఫ్రాంచైజీల యజమానులు ఎవరో, వారి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్:
2008లో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఆ కంపెనీకి ఎన్.శ్రీనివాసన్ వైస్ ప్రెసిడెంట్, ఎండీగా ఉన్నారు. అలాగే సీఎస్‌కే యాక్టివిటీలను ఆయన చూస్తుంటారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్‌కే నడుస్తోంది.
Advertisements
ఢిల్లీ క్యాపిటల్స్:
జీఎంఆర్ గ్రూప్ ఢిల్లీ జట్టును మొదట్లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. అప్పట్లో ఈ టీంకు ఢిల్లీ డేర్ డెవిల్స్ అని పేరు ఉండేది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చారు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్:
డాబర్‌కు చెందిన మోహిత్ బర్మన్, వాడియా గ్రూప్ అధినేత నెస్ వాడియా, పీజడ్‌ఎన్‌జడ్ మీడియా గ్రూప్ అధినేత ప్రీతి జింటా, అపీజయ్ సురేంద్ర గ్రూప్ నుంచి కరన్ పాల్‌లు పంజాబ్ ఓనర్లుగా ఉన్నారు. ప్రీతి జింటా టీం కార్యకలాపాలను చూస్తుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్:
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మెహతా గ్రూప్‌కు చెందిన జూహీ చావ్లా, జై మెహతాలు కోల్‌కతా ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉన్నారు. వీరికి 55, 45 శాతం చొప్పున వాటా ఉంది. షారూఖ్ ఖాన్ టీం కార్యకలాపాలు చూస్తారు.
Advertisement
ముంబై ఇండియన్స్:
ముంబై ఇండియన్స్‌కు మొదట్నుంచీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్‌గా ఉంది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాష్ అంబానీలు టీం కార్యకలాపాలను చూస్తారు.
రాజస్థాన్ రాయల్స్:
ఈ టీంకు మొత్తం 6 మంది ఓనర్లు ఉన్నారు. ట్రెస్కో ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి అమీషా హాతీరమని, ఎమర్జింగ్ మీడియా లిమిటెడ్ నుంచి మనోజ్ బడాలె, బ్లూ వాటర్ ఎస్టేట్ లిమిటెడ్ నుంచి లచ్‌లన్ ముర్దోచ్, కుకి ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ నుంచి రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి, మాజీ ఆసీస్ క్రికెట్ ప్లేయర్ షేన్ వార్న్‌లు ఈ టీం ఓనర్లుగా ఉన్నారు. షేన్‌వార్న్ రాజస్థాన్‌కు గతంలో కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఓనర్ అయ్యాక టీంలోని స్పిన్నర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌కు చెందిన ఆనంద్ క్రిపాలు ఈ టీంకు ఓనర్‌గా ఉన్నారు. మొదట్లో ఈ టీంకు లిక్కర్ మాల్యా ఓనర్ గా ఉన్నాడు. అతను మన దేశంలోని బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాక ఆనంద్ క్రిపాలు ఓనర్ అయ్యారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్:
మొదట్లో ఈ టీం దక్కన్ చార్జర్స్ పేరిట కొనసాగింది. అప్పట్లో దీన్ని డెక్కన్ క్రానికల్ పేపర్ యాజమాన్యం కొనుగోలు చేసింది. తరువాత ఈ టీం సన్ నెట్‌వర్క్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో వారు టీం పేరును సన్ రైజర్స్ హైదరాబాద్‌గా మార్చారు. సన్ నెట్ వర్క్‌కు కళానిధి మారన్ యజమానిగా ఉన్నారు.
Advertisements