Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఐర‌న్ లెగ్ గా భావించిన‌ దివ్య‌భార‌తి టాప్ హీరోయిన్ ఎలా అయ్యింది? ఆమె మ‌ర‌ణం త‌ర్వాత ఆమెకు డూప్ గా న‌టించిందెవ‌రు?

Advertisement

14 ఏళ్ల వ‌య‌స్సుల్లో దివ్య‌భార‌తి అందం, అభినయం చూసి చాలామంది ఆమెను హీరోయిన్ గా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో త‌న త‌ల్లికి తెలిసిన వారి ద్వారా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమె అందం కారణంగా ఆమెకు మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది . మోడలింగ్ లో ఆమెను చూసిన నిర్మాత బుల్షన్ రాయ్ , డైరెక్టర్ రాజీవ్ రాయ్ లు త‌మ‌ విశ్వాత్మ సినిమాలో దివ్య‌భార‌తికి మొదటి అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని గొడవల కారణంగా ఈ సినిమా పూర్తి కాలేదు. ఆ త‌ర్వాత త‌మిళ్ డైరెక్ట‌ర్ జగన్ తాను తీయ‌బోయే నిల‌పొన్నె అనే సినిమాలో అవ‌కాశ‌మిచ్చారు…ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో దివ్య‌భార‌తిని ఐర‌న్ లెగ్ అని పిలిచేవారు.

divya bharathi

మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్:

ఓసారి దివ్య‌భార‌తి ఫోటోను చూసిన డైరెక్టర్ బి గోపాల్ , తను వెంకటేష్ తో చేయబోతున్న బొబ్బిలి రాజా సినిమాలో ఆమెనే హీరోయిన్ గా పెట్టాలనుకొని నిర్మాత రామానాయుడుకి ఫోటో చూపించాడు. రామానాయుడు ఒకే చెప్పారు….దివ్య‌భార‌తి మీద ఐర‌న్ లెగ్ అనే విమ‌ర్శ‌లున్నా అవేవీ ప‌ట్టించుకోకుండా రామానాయుడు త‌న‌నే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

Advertisement

సెప్టెంబర్ 24,1990 లో బొబ్బిలి రాజా సినిమా రిలీజైంది. మొద‌టి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. చాలామంది దివ్యభారతి అందం చూడటానికే సినిమాకు వెళ్లేవారట‌! తర్వాత దివ్య భారతికి టాలీవుడ్ లో వరుసగా కృష్ణ‌, రమేష్ బాబుతో నా ఇల్లే నా స్వర్గం , చిరంజీవి తో రౌడీ అల్లుడు , మోహన్ బాబు తో అసెంబ్లీలో రౌడీ, చిట్టమ్మ మొగుడు , బాలకృష్ణ తో ధర్మక్షేత్రం లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తర్వాత బాలీవుడ్ లో ఆగిపోయిన తన మొదటి సినిమా విశ్వాత్మ కూడా పూర్తి చేసింది. తర్వాత బాలీవుడ్ లో వరుసగా దిల్ క క్యా క‌సూర్ , షోలా ఔర్ స్వప్న , జాన్ సే ప్యారా , దివానా వంటి 8 సినిమాల్లో నటించింది.

Advertisements

divya

దివ్య‌భార‌తి మ‌_ ర‌ణం:

Advertisements

టాలీవుడ్ లో ప్రశాంత్ , దివ్యభారతి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తొలి ముద్దు సినిమా షూటింగ్ జరుగుతున్న స‌మ‌యంలో…… 1993 ఏప్రిల్ 05 న దివ్య భారతి తాను ఉంటున్న 9 అంతస్థుల బిల్డింగ్ పైనుంచి దూకి మర_ ణించింది . దాంతో ఆ సినిమాలో దివ్య‌భారతికి డూప్ గా హీరోయిన్ రంభని పెట్టి పూర్తి చేశారు. అదేవిధంగా కొన్ని హిందీ సినిమాల్లో కూడా దివ్య భారతికి డూప్ గా శ్రీదేవిని అడిగారు ఆమె ఒప్పుకోకపోవడంతో వారు కూడా రంభతో పూర్తి చేశారు .