Advertisement
జున్ను పాలకు మన ఇండియా లో మంచి క్రేజ్ ఉంటుంది. మన దేశంలో ఏమో గాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ఇష్టపడతారు అనే మాట వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వాటి కోసం గ్రామాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక గేదె డెలివరి తర్వాత మాకు కావాలంటే మాకు కావాలని గ్రామాల్లో బాగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా జున్ను పాలకు చాలా డిమాండ్ ఉంటుందనే మాట వాస్తవం.
Read Also:జున్ను పాలు అమెరికాలో ఉంటాయా…? వాటిని ఇంగ్లీష్ లో ఏం అంటారు…?
Advertisement
ఇక జున్ను పాల గురించి మనకు తెలియని విషయాలు ఒకసారి చూస్తే… జున్ను పాలు అంటే, ఆవు కాని, గేదె కాని ఈనిన వెంటనే రెండు మూడు రోజులపాటు ఇచ్చే పాలు అని అర్ధం. ఇంగ్లీషులో వాటిని colostrum అంటారు. అమెరికాలో జున్ను పాలు అమ్మకానికి పూర్తిగా నిషిద్ధం. అమ్మకానికే కాదు, వాడుకకి అక్కడ నిషిద్దమే. కాబట్టి అక్కడ వాటి మాట వినపడదు.
అయితే వైద్యులు చెప్పే దాని ప్రకారం చూస్తే… జున్ను పాలల్లో పోషక పదార్థాలు (nutrients), రోగరక్షకులు (antibodies) ఎక్కువగా ఉంటాయి కాబట్టే ఇవి పెయ్యలకి శ్రేష్ఠమైన పోషకాహారం అని అంటున్నారు. ఇక్కడ మనుషులకి, పశువులకి మధ్య చిన్న తేడా ఉంది. ఈ పోషకాలు, రక్షకాలు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి బొడ్డుతాడు ద్వారా లభించే అవకాశం ఉంటుంది. ఈ రకం అవకాశం పశువులకి లేదు కాబట్టే పాల ద్వారా వెళ్తుంది అంటారు.
Advertisements
Advertisements
Read Also:ఇడ్లీ పిండి ఎందుకు ఉబ్బుతుంది…? పాలు పెరుగు అవ్వాలి అంటే ఏ బ్యాక్టీరియా కావాలి…?