Advertisement
ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కారు/బైక్ ఇంజన్ ఆపితే పెట్రోల్ ఆదా అవుతుందనే ఒక సలహా, సూచన మనం వినే ఉంటాం. అది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇక్కడ మాత్రం జనాలకు ఒక డౌట్ ఉంది. అలా ఆపితే ఫ్యూచర్ లో ఇంజిన్ ఏమైనా ఇబ్బంది పడుతుందా…? ఇక్కడ మీరు రెండు విషయాలు ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
పెట్రోల్ ఆదా చేసే ఆలోచననలో భాగంగా సిగ్నల్ దగ్గర 10 సెకండ్లకి మించి ఆగాల్సి ఉంటే ఇంజిన్ ఆపడమే మంచిది. ఇలా ఆపడంతో పెట్రోల్ ఆదా కావడమే కాకుండా కాలుష్యానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఒకవేళ మీరు ఇంజిన్ ఆపితే అది ముందుకు వెళ్ళాల్సి వస్తే బండి ఆన్ కాకపోతే ఇబ్బంది ఉంటుంది.
Advertisements
ఇక కొండ మీద నుంచి దిగే సమయంలో కూడా ఈ తరహా విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. కొండ మీద నుండి కిందికి దిగే సమయంలో పెట్రోల్ ఆదా చేయాలని ఇంజిన్ ఆపేస్తూ ఉంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. ఇంజిన్ ఆన్ లో ఉండటం చాలా ఉత్తమం. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి.
Advertisements