Advertisement
లడఖ్.. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రాంతం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయత ఉట్టి పడుతుంది. ముగ్ధ మనోహరమైన సుందర దృశ్యాలు కళ్లకు ఇంపుగా కనిపిస్తుంటాయి. ఆ వాతావరణంలో ఉంటే అస్సలు అక్కడి నుంచి అంత త్వరగా కదలలేము. అంతటి గొప్ప ప్రకృతి దృశ్యాలు లడఖ్‌లో మనకు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది. అయితే లడఖ్ ఎంత సుందరమైన ప్రదేశం అయినప్పటికీ అక్కడ మనం ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే…
లడఖ్ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారుగా 9,800 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందువల్ల అంత ఎత్తులో కొందరికి అక్యూట్ మౌంటెయిన్ సిక్ నెస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎత్తు ప్రదేశాల్లో ఉండడం వల్ల కొందరు అసౌకర్యంగా ఫీలై అనారోగ్యం బారిన పడతారు. తలనొప్పి, వికారం, వాంతులు అవుతాయి. కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఆ ప్రదేశంలో ఒంటరిగా ప్రయాణం చేయరాదు. కచ్చితంగా గుంపులుగా వెళ్లాలి. దీంతో ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా.. పక్కన తోడుంటారు కనుక ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
Advertisement
Advertisements
Advertisements
ఇక మనాలి నుంచి లెహ్ వెళ్లే హైవే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇది సుమారుగా 480 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అనేక చోట్ల రోడ్డు పాములా మెలికలు తిరిగి ఉంటుంది. షార్ప్ టర్న్‌లు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుంది. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడి ట్రాఫిక్ ఆగుతుంటుంది. అలాగే శీతాకాలంలో మంచు కురిసి ఇబ్బందులు ఏర్పడుతాయి. అందువల్ల లడఖ్ ప్రాంతంలో ఎవరైనా సరే ఒంటరిగా ప్రయాణం అస్సలు చేయరాదు. గుంపులుగా వెళితే సేఫ్టీ ఉంటుంది.