Advertisement
కార్లు, ట్రెయిన్లు నిజానికి దాదాపుగా ఒకేలాంటి మెకానిజంను కలిగి ఉంటాయి. రెండింటిలోనూ యాక్సలరేటర్, బ్రేకులు ఉంటాయి. అయితే వాటిని నడిపించే విధానం వేరేగా ఉంటుంది. ట్రెయిన్లలో బ్రేకులను రిలీజ్ చేసి ట్రాక్షన్ మోటార్లకు విద్యుత్‌ను సరఫరా చేసి ట్రెయిన్లను కదిలించాలి. అదే కారులో అయితే హ్యాండ్ బ్రేక్ తీసి కీస్ ద్వారా ఇగ్నిషన్ ఆన్ చేసి క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వేసి నెమ్మదిగా క్లచ్‌ను రిలీజ్ చేస్తూ కార్‌ను నడిపించాల్సి ఉంటుంది. అయితే కారు, ట్రెయిన్ రెండింటికీ నడిపించే విధానం దాదాపుగా ఒకే ఉన్నా.. నిజానికి ట్రెయిన్‌ను నడపడమే చాలా కష్టం. కానీ కొందరు ట్రెయిన్‌ను సులభంగా నడిపించవచ్చని అనుకుంటారు.
Advertisement
కారులో మనకు యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్, గేర్లు.. ఇలా కేవలం కొన్ని కంట్రోల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ రైలులో ఇంజిన్‌లో లోకో పైలట్‌కు రైలును నడిపేందుకు సుమారుగా 100కు పైగా కంట్రోల్స్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. రైలు నడుస్తున్నంత సేపు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలి. లేదంటే రైలు డ్రైవర్ చేసే తప్పు వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల కారును కాదు.. రైలును నడిపించడమే చాలా సవాల్‌తో కూడుకున్న పని.
కారులో యాక్సలరేటర్ తొక్కడం, బ్రేకులు వేయడం చాలా సులభతరమైన పని. అదే రైలులో అయితే వేగం పెంచడం కన్నా.. బ్రేకులు వేయడమే చాలా కష్టంతో కూడుకున్న పని. సిగ్నల్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ రైలును నడపాలి. అలాగే ఎంత స్పీడ్‌లో వెళ్లినా.. చాకచక్యంగా బ్రేకులు వేయాలి. స్టేషన్లలో కచ్చితంగా ప్లాట్‌ఫాం మీదకు రైలు వచ్చి ఆగేందుకు ముందుగానే బ్రేకులు వేస్తూ రైలు వేగాన్ని నియంత్రించాలి. ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పని.
Advertisements