Advertisement
విమానం ఎక్కిన తర్వాత మనకు వచ్చే సందేహాలు అన్నీ ఇన్ని కాదు. ఎన్నో సందేహాలు, అనుమానాల్లు, ప్రశ్నలతో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా…? అందులో ఒకటి విమానం కిటికీకి ఉండే అద్దాన్ని పగలగొట్టడం సాధ్యమా…? బస్సు అద్దాన్ని పగలగొట్టి అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చినట్టు విమానం అద్దాన్ని పగలగొట్టడం సాధ్యమేనా…? అసలు ఏ మాత్రం కూడా సాధ్యం. అసలు ఆ అద్దాలను ఏ విధంగా తయారు చేస్తారో ఒక్కసారి చూద్దాం.
Read Also:ఫోన్ చార్జింగ్ 100 శాతం పెడితే ఏమవుతుంది…? అసలు ఎంత వరకు వచ్చాక చార్జింగ్ పెట్టాలి…?
విమానం కిటికీకి మూడు అద్దాలు ఉంటాయి. మూడు అద్దాలు ఎందుకో ఒకసారి చూద్దాం. బయట ఉండే అద్దం చాలా గట్టిది. ఎందుకంటే… విమానం భూమికి దాదాపుగా 35 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్తుంది. అక్కడ మనకు ఆక్సీజన్ అందే అవకాశం ఉండదు. అక్కడ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషులకు గాలి అందడం సాధ్యం కాదు కాబట్టి… స్పృహ కోల్పోయి క్రమంగా 10–15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
Advertisements
అంత ఎత్తులో మనకు ఊపిరి అందాలి అంటే… అక్కడ వాతావరణానికి సరిపోయే అంత ఒత్తిడి ఉండాలి. అందుకే విమానంలో ఎక్కువ ఒత్తిడి ఉండేలా చూస్తారు. విమానం గాల్లో ఉన్న సమయంలో అద్దం పగులితే… బయట ఉండే లో ప్రెజర్ విమానం లోని ఎక్కువ ఒత్తిడికి మధ్య తేడాతో విమానంలోని సామాను బయటకు వెళ్ళిపోతుంది. 2018 లో ఎయిర్ ఇండియా విమానం అద్దం పగిలి పైలెట్ బయటకు వెళ్ళిపోయి సీట్ బెల్ట్ తో బ్రతికి బయట పడ్డాడు.
ఇక దాని తర్వాత మన సీటు పక్కన ఉండేది స్క్రాచ్ రేసిస్టేంట్ గ్లాస్. గీతలు పడకుండా, మనం విశ్వ రూపం చూపించి గుద్దినా పగిలే ఛాన్స్ ఉండదు. ఈ రెండు మధ్యలో ఉండే గ్లాస్ ను ACRYLIC SOLUTION తో తయారు చేస్తారు. ఇది 3 వేల కేజీల వరకు అడ్డుకునే అంత శక్తివంతంగా ఉంటుంది. ఒక బాక్సర్ ఎంత బలంగా గుద్దినా 1300 కేజీలు మాత్రమే శక్తి వస్తుంది.
Advertisements
Read Also:ఏసీ రూమ్ లో బీరువా ఉంటే ఏమవుతుంది…?