Advertisement
విమానం నడపడం అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. కారో, బండో నడిపినట్టు నడిపితే అంతే ఇక. అందుకే పైలెట్ లకు శిక్షణ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి మైండ్ నుంచి ప్రతీ ఒక్కటి వృత్తి మీదనే ఉంటే మనం క్షేమంగా గమ్యం చేరుకుంటాం. ఇక అసలు విషయానికి వస్తే పైలెట్ కి ల్యాండింగ్, టేకాఫ్ రెండు కాస్త సవాల్ తో కూడినవి… కాబట్టి పైలెట్ కి ఏది కష్టమో ఒక్కసారి చూద్దాం.
Advertisement
విమానం టేకాఫ్ కంటే కూడా ల్యాండింగ్ అంటే కిందకు దింపడం ఒక సవాల్. దీనికి నాలుగు దశలు ఉంటాయి. పతి దశలోనూ నిర్దిష్ట వేగం ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎత్తును కూడా చాలా జాగ్రత్తగా మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. వేగం పెరిగినా, ఎత్తు పెరిగినా సరిగా ల్యాండ్ అవ్వదు. అలా అని తగ్గినా, సరే విమానం కూలిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే ల్యాండింగ్ అనేది చాలా కష్టమైన వ్యవహారం.
పైలెట్ నేర్చుకునే శిక్షణ మొత్తం ఒక ఎత్తు ల్యాండింగ్ మొత్తం ఒక ఎత్తు. ఎంతో ప్రాక్టీస్ తర్వాతనే ల్యాండింగ్ చేయడం వస్తుంది. సరిగా ల్యాండింగ్ చేయకపోతే విమానం ముందు భాగం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ. టేకాఫ్ విషయానికి వస్తే అది చాలా సులువుగా ఉంటుంది. ఒక వేగానికి చేరగానే విమానం ఎగురుతుంది.
Advertisements
Also Read: సిగ్నల్ దగ్గర ఇంజిన్ ఆపడం మంచిదేనా…? ఘాట్ రోడ్ లో దిగే టైం లో ఇంజిన్ ఆపితే…?
Advertisements