Advertisement
విమానాల్లో ఆటో-పైలట్ వ్యవస్థ ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. పైలట్లు కొన్ని సమయాల్లో ఆటో పైలట్ వ్యవస్థ ద్వారా విమానాలను నడుపుతుంటారు. విమానం నిర్దిష్టమైన ఎత్తులో నిర్ణీతమైన వేగంతో కొంత దూరం పాటు ప్రయాణించాల్సి వస్తే.. పైలట్లు ఆటో పైలట్ వ్యవస్థను ఆన్ చేసి కొంత సేపు రిలాక్స్ అవుతారు. దీంతో విమానం దానంతట అదే ప్రయాణిస్తుంది. అయితే భారతీయ రైళ్లలోనూ కొంచెం అటు, ఇటుగా సరిగ్గా ఇలాంటి వ్యవస్థే ఉంది.
భారతీయ రైల్వేలో పలు అధునాతన ఇంజిన్లలో విమానాల్లో ఉండే లాంటి ఆటో పైలట్ సిస్టమ్‌ను వాడుతారు. దీన్నే బీపీసీఎస్ అని పిలుస్తారు. ఇందులో భాగంగా చిత్రంలో చూపినట్లు ఒక స్విచ్ ఉంటుంది. లోకో పైలట్లు ట్రెయిన్ 100 కిలోమీటర్ల వేగంతో నిర్దిష్టమైన దూరం పాటు ప్రయాణించాల్సి వస్తే.. ఈ స్విచ్‌ను ఆన్ చేస్తారు. దీంతో ఆటో పైలట్ సిస్టం తరహాలో ఈ స్విచ్ పనిచేస్తుంది. ట్రెయిన్‌ను ప్రయాణింపజేయిస్తుంది.
Advertisement
బీపీసీఎస్ స్విచ్‌ను ఆన్‌చేయగానే రైలు దానంత అదే ప్రయాణిస్తుంది. దానికి అవసరమైన విద్యుత్‌ను అదే తీసుకుంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ ను మెయింటెయిన్ చేస్తూ రైలును ముందుకు ప్రయాణింపజేయిస్తుంది. అయితే సాధారణంగా ఈ విధానాన్ని ఉపయోగించి లోకో పైలట్లు రైళ్ల వేగాన్ని నియంత్రించేందుకు వాడుతారు. స్పీడ్ లిమిట్ ఉన్న రైళ్లలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
Advertisements
Advertisements
ఇక బీపీసీఎస్ ఆన్‌లో ఉన్నప్పటికీ లోకో పైలట్ బ్రేకులు వేసినా.. యాక్సలరేటర్‌ను పెంచినా.. ఆటోమేటిగ్గా బీపీసీఎస్ ఆఫ్ అవుతుంది. దీంతో రైలు లోకో పైలట్ నియంత్రణలోకి వస్తుంది. దాన్ని లోకో పైలట్ నడపాల్సి ఉంటుంది. ఇలా మన రైళ్లలో ఆటో-పైలట్ వ్యవస్థ పనిచేస్తుంది.