Advertisement
సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది…? ఉంటే ఉంది గాని సముద్రాల తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాల బావుల్లో ఆ నీరు ఎందుకు సాధారణంగా ఉంటుంది…? చినరాయుడు సినిమాలో… కోటాను బాబు మోహన్ అడిగే ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా బీచ్ లు ఇసుకతో నిండి ఉంటాయి.
Read Also:ఉదయం త్వరగా నిద్ర లేవాలంటే ఏం చేయాలి…?
ఈ ఇసుక… నీటిని చాలా వేగంగా పీల్చుకుంటుంది. మీరు గమనించే ఉంటే… మన దగ్గర ఎక్కువ నీరు భూమి మీద పోస్తే తేలుతుంది. కాని బీచ్ లో ఎన్ని నీరు ఉన్నా సరే ఆ ఇసుకలో పీల్చుకుంటుంది. అలాగే… అలాగే ఆ ఇసుకపైనున్న లవణాలను(మినరల్స్) సైతం నీళ్ళల్లో కరిగిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి వర్షం పడిన తర్వాత ఆ స్వచ్చమయిన నీటికి లవణాలు తోడవడమే కాక పోరస్ గుణం ఉన్న ఇసుకవల్ల మలినాలు కూడా అంటటం జరగదు.
Advertisement
Advertisements
అలా అయితే సముద్రానికి పక్కనే ఉన్న నీరు ఉప్పగా ఉండాలిగా…? కానీ ఆలా జరగదు. ఎందుకంటే సాంద్రత (డెన్సిటీ) ఉప్పు నీటికి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఎక్కువ సాంద్రత కలిగి ఉంటే దాని బరువు ఎక్కువగా ఉంటుంది. సముద్రపు నీరు బరువుగా ఉంటాయి. అందుకే కాబట్టి భూగర్భంలో తక్కువ సాంద్రత ఉన్న మంచి నీరు ,ఉప్పు నీటి పై తేలుతుంది కాబట్టి నీరు ఉప్పగా ఉండదు.
Advertisements
Read Also:ఇది కదా క్రికెట్ అంటే: రన్ అవుట్ చేసే ఛాన్స్ వచ్చినా కావాలని వదిలేసిన కీపర్