Advertisement
తేజ దర్శకత్వంలో 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం నువ్వు నేను. ఉదయ్ కిరణ్ కు ఈ సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా కథ విషయంలో అప్పట్లో సినీ ప్రముఖులు ప్రసంశలు కూడా కురిపించారు. కీలక విభాగాలకు సంబంధించి దాదాపుగా అన్ని అవార్డులు దక్కాయి ఈ సినిమాకు. ఇక పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది.
నువ్వు నేను సినిమాకు గానూ… ఉత్తమ దర్శకుడిగా తేజాకు నంది అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాక్లు నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు రావడం గమనార్హం. ఉదయ్ కిరణ్ కు తిరుగు లేదు అని ప్రూవ్ చేసిన సినిమా తేజా కు స్టార్ దర్శకుడు అని ప్రూవ్ చేసిన సినిమా కూడా ఇదే.
Advertisement
Advertisements
అయితే ఈ సినిమాలో నటించిన చాలా మంది కీలక పాత్రలు పోషించిన నటులు ఇప్పుడు లేరు. ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకోగా ఆహుతి ప్రసాద్ అనారోగ్యంతో అనూహ్యంగా ప్రాణాలు విడిచారు. ఇక ఎం ఎస్ నారాయణ కూడా అదే విధంగా ప్రాణాలు కోల్పోయారు. ధర్మవరపు సుబ్రమణ్యం కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా ఆయన కూడా అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పోషించిన వైజాగ్ ప్రసాద్ కూడా కన్ను మూశారు. కళాశాల ప్రిన్సిపల్ గా ఎం. ఎస్. నారాయణ, కామర్స్ లెక్చరర్ గా ధర్మవరపు సుబ్రమణ్యం నటించారు.
Advertisements