Advertisement
WWE .. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్.. గతంలో దీన్నే WWF.. అని పిలిచేవారు. ఇందులో భాగంగా రెజ్లర్లు మ్యాచ్‌లలో ఫైటింగ్ చేస్తూ నువ్వా నేనా అన్నట్లు పోరాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఫైటింగ్ చాలా దారుణంగా ఉంటుంది. గాయలవుతాయి, రక్తాలు కారుతాయి, హాస్పిటల్ పాలు కావల్సి వస్తుంది. అయితే ఇంతకీ అసలు WWE ఫైటింగ్ అంతా నిజమేనా ? ఫేకా ? ఈ ప్రశ్న మనకు చిన్నతనం నుంచి వస్తూనే ఉంది. మరి దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందామా..!
WWE ఫైటింగ్ ఫేకా ? రియలా? అంటే మిక్సింగ్ అని చెప్పవచ్చు…. ఎందుకంటే ఫైటింగ్ నిజమే కానీ ఆ మ్యాచ్ లో ఎవరు గెలవాలి అనేది ముందుగానే డిసైడ్ చేస్తారు. దానికి తగ్గట్టు ఫైటింగ్ జరుగుతుంటుంది. ఈ క్రమంలో రెజ్లర్లకు గాయాలవుతాయి. రక్తాలు కారేలా తన్నుకుంటారు.
Advertisement
Advertisements
ఇక WWE ని ముందుగా ప్రారంభించినప్పుడు ఇది స్పోర్ట్సా అని కోర్టు అడిగితే అందుకు దాని ఓనర్ విన్స్ మెక్‌మహోన్ బదులిస్తూ.. స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నాడు. దీంతో తాను కట్టాల్సిన చార్జిలు, పన్నుల బెడద తగ్గింది. అయితే ఓ సరికొత్త రంగం ఆవిర్భవించింది. స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనడంతో WWE కాస్తా క్లిక్ అయ్యింది. దీంతో జనాలు విపరీతంగా చూడడం మొదలు పెట్టారు. సరే మ్యాచ్ ఎవరు గెలవాలో ముందుగా డిసైడ్ అయినప్పటికీ ఫైటింగ్ మాత్రం రియల్‌గానే జరుగుతుంది. కొన్ని సార్లు లైవ్‌గా, రియలిస్టిక్‌గా మ్యాచ్‌లను నిర్వహిస్తారు. అందుకనే WWE అంతగా పాపులర్ అయింది.
Advertisements
అయితే ఆ మ్యాచ్‌లలో ఫైట్ చేసేందుకు రెజ్లర్లు తమ అసలు పేర్లు కాకుండా నిక్ నేమ్స్‌ను పెట్టుకుంటారు. ఇక ఆ ఫైటింగ్ కోసం వారు ట్రెయినింగ్ కూడా తీసుకుంటారు.