Advertisement
ముస్లీంల పండుగలు, ఉర్సుల సమయంలో మనకు ఇలాంటి జెండాలు తోరణాలుగా కట్టబడి కనిపిస్తుంటాయి.! వీరికి బొత్తిగా దేశభక్తిలేదా? బాహాటంగా పాకిస్థాన్ జెండాలను ఇలా తోరణాలుగా కట్టడమేంటి? అని నేను సైతం విస్తుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది నాకే కాదు నాలాంటి ఎందరికో ఓ ఉన్న ఫీలింగ్.
వాస్తవానికి తోరణాలుగా కట్టబడిన ఈ జెండాలు పాకిస్థాన్ జెండాలు కాదు.! ఇస్లామిక్ జెండాలు.! తమ ఇస్లామిక్ మతానికి ప్రతీకగా ఈ జెండాలను తోరణాలు కడతారు.!
కేరళలోని ముస్లీం లీగ్ పార్టీ జెండా కూడా పాకిస్తాన్ జాతీయ జెండాను పోలి ఉండడంతో అప్పుడు దాని మీద పెద్ద చర్చే జరిగింది. తర్వాత జెండాలలోని తేడాను గమనించాక ఈ చర్చ సద్దుమణిగింది.
Advertisement
కేరళ ముస్లీం లీగ్ పార్టీ జెండా:
Advertisements
ఇస్లామిక్ జెండా… దాని చరిత్ర :
మొదట ఓ ఫిక్స్ కలర్ లేకుండా ఉన్న జెండా కాలానుగుణంగా ఆకుపచ్చ కలర్ లోకి మారింది. ముఖ్యంగా మొఘలుల కాలంలో జెండాలో ఎక్కువ మార్పులు వచ్చాయి. మొదట సింహం ఉదయిస్తున్న సూర్యుడిగా ఉన్న జెండా, తర్వాత ఆలంఘీర్ కాలంలో త్రిభుజాకృతికి మారింది..1857 లో జెండా మీదకు నెలవంక వచ్చింది.
Advertisements
ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే…. హిందూ ముస్లీం భాయ్ భాయ్… ఇద్దరి మధ్య వైషమ్యాలను పెంచే వారు వీటినే తప్పుగా ప్రచారం చేస్తూ మన ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్తగా ఉందా.! వందేమాతరం.