Advertisement
జాతీయ భాష ఏంటీ…? హిందీ… జాతీయ పక్షి ఏంటీ నెమలి… జాతీయ జంతువు ఏంటీ పులి, మరి జాతీయ క్రీడ ఏంటీ…? హాకీ అని చెప్పేస్తారు కదా… ఎవరైనా అలా చెప్తే అసలు నమ్మకండి. మన దేశానికి జాతీయ క్రీడా లేనే లేదు. కాని పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి చెప్పిన పులిహోరే చెప్పి చెప్పి మనల్ని విసిగిస్తున్నారు.
1928–1956 మధ్య కాలంలో 8 స్వర్ణాలు, ఒక రజతం మరియు రెండు కాంస్య పతకాలు సాధించింది హాకీ జట్టు. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా మన చరిత్ర చెప్తుంది. ఇండియా ఒలింపిక్స్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 76 గేమ్స్ లో గెలిచింది. స్వాతంత్రం తరువాత పాకిస్తాన్ హాకీని తన జాతీయ ఆటగా ప్రకటించుకుంది. ఇక ఆ తర్వాత మన దేశంలో క్రికెట్ కు ప్రాధాన్యత పెరిగింది.
Advertisement
Advertisements
హాకీ టీం లో ఎంత మంది ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. ఆర్టీఐ[Right To Information] సమాధానంలో, క్రీడా మంత్రిత్వ శాఖ ఎలాంటి క్రీడను జాతీయ ఆటగా ప్రకటించలేదని కూడా స్పష్టం చేసింది. ఒక దేశం జాతీయ క్రీడను నిర్ణయించడంలో ఆ దేశపు సంస్కృతి కీలకంగా ఉంటుంది. కాని మనది ఉపఖండం కావడం, విభిన్న సంస్కృతులు ఉండటంతో ఒక క్రీడను జాతీయ క్రీడా అని చెప్పలేం. కబడ్డీ ఉత్తరాన ప్రసిద్ధి చెందిన ఆట. బెంగాల్‌లో ఫుట్‌బాల్ ప్రాచుర్యం పొందిన ఆట.
Advertisements