Advertisement
కుటుంబాలకు దూరంగా హాస్పిటల్స్ లో ఒక్కరే గడపడం…డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేసి వెళ్లిపోవడం.. ఐసోలేషన్లో ఒంటరిగా బతికే కరోనా పేషెంట్స్ కి తోటి పేషెంట్స్ తప్ప మరో ప్రపంచం లేదు …దాంతో మాటా మాటా పరిచయాల వరకు ఒకే కానీ.. ఓ జంట ఏకంగా ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం ఆసక్తి కరంగా మారింది..
గుంటూరులోని పర్చూరుకి చెందిన ఒక అబ్బాయికి కోవిడ్ పాజిటివ్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.. అప్పటికే అదే హాస్పిటల్లో పాజిటివ్ తో జాయిన్ అయింది చిలకలూరి పేట అమ్మాయి.. ఇద్దరివి పక్కపక్క బెడ్లూ.. పద్నాలుగు రోజుల పాటు ఐసోలేషన్లో కలిసే ట్రీట్మెంట్ తీసుకున్నారు..కుటుంబానికి దూరంగా ఉండడం కోవిడ్ భయంతో అమ్మాయి డౌన్ అవుతున్న ప్రతిసారి అబ్బాయే ధైర్యం చెప్పేవాడు..
Advertisement
అబ్బాయిది సేమ్ పరిస్థితి అప్పుడు అమ్మాయి తన మాటలతో ఊరటనిచ్చేది..దాంతో ఇద్దరి మధ్య మాటల పరిచయం ప్రేమగా మారింది.. ఐసోలేషన్ గడువు పూర్తయి నెగటివ్ వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు..తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు… అబ్బాయి సాఫ్ట్ వేర్ ఎంప్లాయి.. అమ్మాయి కూడా అవే జాబ్ ప్రయత్నాల్లో ఉంది.. ముఖ్యంగా ప్రేమ పెళ్లిల్లకు ఎదురయ్యే సమస్య కులం..వీళ్లిద్దరిది ఒకే సామాజిక తరగతి కావడంతో పెద్దలు నో చెప్పడానికి ఆస్కారం లేకపోయింది..సో పెద్దలు కూడా వారి పెళ్లికి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు..
ఇద్దరి పెళ్లి జరిగిపోయింది..ప్రస్తుతం కొత్త అల్లుడి హోదాలో అత్తారింట్లో మరో పద్నాలుగు రోజులు గడపబోతున్నాడు.. పాజిటివ్(సుఖాంతం) గా ఎండ్ అయిన వీరి ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Advertisements
Advertisements