Advertisement
నా జన్మ సక్రమమా? అక్రమమా?? నాకు తెలియదు.! పుట్టగానే చెత్తకుప్పలోకి ఎందుకు వొచ్చి చేరానో కూడా నాకు తెలియదు.! కారణాలేవో, కారకులెవరో… నా అనే వాళ్ళు లేకుండా సాగుతున్న నా జీవితంలోకి ఓ వీధి కుక్క వొచ్చి చేరింది. దానికి నే పెట్టుకున్న పేరు జానీ… నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు జానీ,జానీ కి నేను అంతే మా కేరాఫ్ అడ్రెస్స్ మాత్రం చిత్తు కాగితాలు, చెత్త కుప్పలే!అక్కడే ఇద్దరం కలిసి ఆహారాన్ని శోధించాము కడుపులు నింపుకున్నాము.
కుటుంబం అంతే ఏమిటో తెలియని నాకు జానీ మూడు పిల్లలకు జన్మనివ్వడం వాటిని అల్లారుముద్దుగా చూసుకోవడంతో ‘తల్లి ప్రేమ’ అంటే ఏమిటో అర్థం అయ్యింది. వాటిని చూసినప్పుడల్లా ‘నాకూ అమ్మ ఉంటేనా?’నని అనుకునేవాడిని.!
Advertisement
ఎప్పటిలాగే ఉదయం చెత్త వేరడానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి జానీ పిచ్చిపిచ్చిగా మొరుగుతుంది. కార్ల వెంట పరిగెడుతూ భౌ..భౌ…మని అరుస్తుంది. ఉదయం ఒక కారు కుక్క పిల్లల మీదినుండి పోవడంతో అవి చనిపోయాయి…అప్పటి నుండి అది ఇలా ప్రవర్తిస్తుందని తెలుసుకున్నాను.! 20 రోజులు ఏ కార్ కనిపించిన పరిగెడుతూనే ఉంది.మొరుగుతూనే ఉంది..అలా చివరకు పిచిదైంది..మున్సిపాలిటీ వాళ్ళు నా కళ్ళముందే దానిని చంపేశారు.
ఒక జంతువుకే తన పిల్లల పట్ల ఇంతలా ప్రేముంటే…మరి నన్ను చిన్నప్పుడే చెత్తకుప్ప పాలు చేసిన నా తల్లి పరిస్థితిని చూసి జాలేసింది? మనుషుల గురించి ఆలోచిస్తే సిగ్గేస్తుంది. అలాంటి తల్లితో నేను కలిసి లేనందుకు సంతోషమేస్తుంది. నా జానీ నాతో లేనందుకు బాధేస్తుంది.
Advertisements