Advertisement
జబర్దస్త్ వెంకీ మంకీ టీమ్ లో టైమింగ్ తో పంచులు పేలుస్తున్న హరిత నిజంగానే అమ్మాయా? లేక అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయా? అనేది చాలా మంది అనుమానం! సో ఇప్పుడు ఆ డౌట్ ఏం అక్కర్లేదు…హరితగా నటించే హరి అబ్బాయే…ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు….కేవలం లేడీ గెటప్ కోసమే అలా రెడీ అవుతాడు.
జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది?
Advertisement
డాన్స్ మాస్టర్ గా ఒక స్కూల్లో పనిచేసే హరి… వివిధ స్కిట్స్ లో లేడీ గెటప్స్ వేస్తుండేవాడు…అలా ఓ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన జబర్దస్త్ భాస్కర్ లేడీ గెటప్ లో ఉన్న హరిని చూసి ఇలాగే చేయమని ప్రోత్సాహించడంతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. దీంతో ఆయనతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయన రెఫరెన్స్ తో చంటి టీమ్ లో కంటెస్టెంట్ గా అవకాశమొచ్చింది. మొదట్లో అనేక ఇబ్బందులు పడ్డ హరి…..ఇప్పుడు వెంకీ మంకీ టీమ్ లో కీ పార్టిసిపేంట్ అయ్యాడు. అందంతో పాటు అతని కామెడీ టైమింగ్ సూపర్బ్ గా ఉండడంతో మొదట్లో అంతగా గుర్తింపులేని వెంకీ మంకీ టీమ్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్ గా మారింది. దీనికి కారణం హరితనే కావడం గమనార్హం!
Advertisements
బయట టీజింగులు:
ఏవైనా ప్రోగ్రామ్ లకు వెళ్లినప్పుడు తమను నిజంగానే అమ్మాయిలు అనుకొని చాలా మంది మీద పడిపోతుంటారని వాపోయాడు హరి… తనదే కాదు వినోద్, శాంతి స్వరూప్ లది కూడా ఇదే ప్రాబ్లమని చెప్పుకొచ్చాడు హరి… ఫ్యామిలీ కోసం నటనపై ఇష్టంతోనే ఈ గెటప్స్ వేస్తున్నామని…దీన్ని మరోలా వాడుకోవాలని లేదని చెప్పుకొచ్చాడు హరి!
Advertisements